నాగార్జున కింగ్ అంతే

Update: 2017-10-05 07:14 GMT
చాలా వరకు స్టార్ హీరోలు ఒక కథను ఒకే చేస్తే దర్శకుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటని చూస్తారు. ముఖ్యంగా సక్సెస్ ట్రాక్ లో ఉన్నడా లేడా అని ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ కింగ్ నాగార్జున మాత్రం అవేమీ పట్టించుకోరు. కథ తనకు కొత్తగా అనిపిస్తే చాలు దర్శకుడు ఏ స్థాయి వారు అని చూడకుండా ఛాన్స్ ఇస్తాడు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా ప్రయోగాలు చేయడానికి ముందు ఉంటారు.

నాగార్జున ఒక సినిమాను స్టార్ట్ చేశాడు అంటే చాలు సినిమా ఎండింగ్ వరకు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో నాగ్ చేసినంతగా ఏ హీరో చెయ్యడనే చెప్పాలి. ఎందుకంటే చిత్ర యూనిట్ వచ్చినా రాకున్నా నాగ్ ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తుంటారు. ప్రస్తుత చిత్రం రాజుగారి గది 2 సినిమా కోసం కూడా నాగ్ ప్రమోషన్స్ ని ఒంటరిగా నిర్వహించారు. మొదటి సారి ఒక హర్రర్ కథాంశంతో నాగార్జున వస్తున్నాడు. ఎలాగైనా సినిమా హిట్ అవ్వాలని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. హర్రర్ తరహాలో వచ్చిన చంద్రముఖిని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడ్డారు. దీంతో ఆ స్థాయిలో హిట్ అవ్వాలని ఓ వైపు చైతు వివాహం దగ్గర పడుతున్నా కూడా రీసెంట్ గా ప్రమోషన్స్ నిర్వహించారు నాగార్జున.

సినిమా ఎంత బాగున్నా ఈ రోజుల్లో ప్రమోషన్స్ లేకుంటే అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. దీంతో ప్రతి సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని ఎక్కువగా హైలెట్ చెయ్యాలి అనుకుంటారు. నాగార్జున తన కొడుకుల విషయంలో కూడా ప్రమోషన్స్ ఫస్ట్ అని ముందుండి సినిమా ప్రమోషన్స్ ని నిర్వహిస్తారు. చాలా వరకు ఈ ఫార్ములా సక్సెస్ అయ్యింది. అక్కినేని అఖిల్ - హలో సినిమాను నిర్మిస్తున్న నాగ్ ఆ సినిమా ప్రమోషన్స్ ని కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నారు.
Tags:    

Similar News