పాతిక దాటింది.. ఊపిరి పీల్చుకోవచ్చా?

Update: 2016-04-02 04:22 GMT
నాగార్జున - కార్తిల మల్టీ స్టారర్ మూవీ ఊపిరి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పుడీ సినిమా రిలీజ్ అయ్యి దాటడంతో వసూళ్ల లెక్కలు.. ఓ రేంజ్ కు చేరుకున్నాయి. తెలుగు ఊపిరి, తమిళ తోఝా వెర్షన్లకు కలిపి మొత్తం 26.75 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది ఊపిరి. గ్రాస్ లెక్క అయితే 43.1 కోట్లుగా ఉండడం విశేషం.

తొలి వారంలో నైజాం నుంచి 4.52 కోట్లు - సీడెడ్ 1.97 కోట్లు - వైజాగ్ 1.36 కోట్లు - ఈస్ట్ కోటి - వెస్ట్ 0.72 కోట్లు - కృష్ణా 1.02 కోట్లు - గుంటూరు 1.20 కోట్లు - నెల్లూరు 0.46 కోట్ల షేర్ వసూలైంది. ఏపీ తెలంగాణల్లో మొత్తం కలిపి 12.25 కోట్ల షేర్ కలెక్షన్లు రాగా, తమిళనాడులో 7.7 కోట్లు - కర్నాటక నుంచి 2.30 కోట్లు - యూఎస్ ఏలో 4.50 కోట్లు రాబట్టడం విశేషం. కేరళ - రెస్టాఫ్ ఇండియా - ఇతరదేశాల వసూళ్లను  ఈ మొత్తానికి కలపాల్సి ఉంటుంది.

ఓవర్సీస్ లో ఊపిరి కనీసం 1.5 మిలియన్ డాలర్లను సాధించే ఛాన్స్ ఉందంటున్నారు. బడ్జెట్ పరంగా ఇంకా రికవర్ కావాల్సిన మొత్తం ఎక్కువే ఉంది. కనీసం 60 కోట్లు వసూలైతే కానీ ఊపిరిని సూపర్ హిట్ అనలేని పరిస్థితి. అయితే గతంలో సోగ్గాడే చిన్ని నాయన మాదిరిగా లాంగ్ రన్ కు ఎక్కువగా స్కోప్ లేకపోవడం నిరుత్సాహకరమైన విషయం. మొత్తానికి ఇది సేఫ్ ప్రాజెక్ట్ గానే నిలుస్తుందనే అంచనాలే ఉన్నాయి.
Tags:    

Similar News