అక్కినేని నాగార్జునకు తమిళంలో కూడా ఓ మోస్తరు ఫాలోయింగే ఉంది. శివ, గీతాంజలి లాంటి డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు నాగ్. ‘రక్షకన్’ లాంటి డైరెక్ట్ తమిళ మూవీ కూడా చేశాడు. ఐతే ఆ సినిమాలకు నాగ్ సొంతంగా డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు. ఎవరో డబ్బింగ్ ఆర్టిస్టులే ఆయనకు వాయిస్ ఇచ్చారు. నాగార్జునకు తమిళం తెలిసినా.. బాగా మాట్లాడగలిగినా ఎప్పుడూ ఆయన డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఐతే తొలిసారి తన సినిమాకు ఆయన తమిళంలో డబ్బింగ్ చెబుతున్నాడు. ఆ సినిమానే.. ‘తోజా ’. ‘ఊపిరి’ మూవీకి తమిళ వెర్షన్ ఇది.
ఊపిరి సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలోనూ తీసింది పీవీపీ సంస్థ. అందుకే కార్తి, తమన్నా లాంటి రెండు చోట్లా పరిచయమున్న హీరో హీరోయిన్లను ఎంచుకున్నారు. విశేషం ఏంటంటే నాగ్ తో పాటు కార్తి, తమన్నాలు కూడా ఈ సినిమాకు రెండు వెర్షన్లలోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తమన్నా తొలిసారి ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటుండటం ఇదే తొలిసారి. ఇక కార్తి ఆల్రెడీ తెలుగులో తన డబ్బింగ్ సినిమాలకు వాయిస్ ఇచ్చాడు కాబట్టి అతడికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక నాగార్జున సైతం తమిళంలో వాయిస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘తోజా’ టీజర్ లో సైతం నాగార్జున వాయిసే వినిపించింది. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అని తెలుగులో చెప్పిన డైలాగ్ ను తమిళంలో ‘నీ రొంబ అళగా ఇరుక్కే’ అని చాలా స్పష్టంగా పలికాడు నాగ్.