చీరలో చూసి వాళ్లు వెక్కిరించేవాళ్లు: విశ్వక్ సేన్
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. తను హీరోగా నటించిన లైలా సినిమా మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన విశ్వక్, లైలా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఆర్టిస్ట్ గా ప్రతీ నటుడికీ కొన్ని పాత్రలు చేయాలనుంటుందని, ఆడియన్స్ కొత్త కథలను, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారని, దానికి తోడు ఈ జానర్ లో సినిమా వచ్చి 20 ఏళ్లు దాటిపోతుందని ఈ జనరేషన్ లో ఓ హీరో లేడీ గెటప్ వేయడం జరగలేదని, ఆ లోటును తీర్చడానికే లైలా సినిమా చేశానని విశ్వక్ తెలిపాడు.
లేడీ గెటప్ లోకి మారడానికి రోజూ రెండున్నర గంటల టైమ్ పట్టేదని, తన టీమ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ఎవరూ ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, అందుకే లైలా పాత్ర చాలా నేచురల్ గా వచ్చిందని విశ్వక్ తెలిపాడు. లేడీ గెటప్ లో చీర కట్టుకుని, హై హీల్స్ వేసుకుని యాక్షన్ సీన్స్ చేయడం చాలా కష్టమనిపించిందని విశ్వక్ చెప్పాడు.
సినిమాలో లైలా పాత్ర ఎక్కువ హైలైట్ అయినప్పటికీ రెండో క్యారెక్టర్ అయిన సోనూ మోడల్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, ఫస్టాఫ్ లో సోనూ మోడల్ లైఫ్ స్టైల్ ను చాలా మంది ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. లైలా గెటప్ ను తన ఇంట్లో వాళ్లు చూసి తెగ నవ్వుతూ వెక్కిరించే వాళ్లని, తన అత్త, అమ్మ చీరలు మ్యాచింగ్ చీరలు కట్టుకుని వచ్చి మరీ ఏడిపించేవారని విశ్వక్ అన్నాడు.
తాను ఏ కథ వినేటప్పుడైనా సీరియస్ మోడ్ లో వింటానని, కానీ ఈ కథ విన్నంతసేపూ నవ్వుకుంటూనే ఉన్నానని చెప్పిన విశ్వక్, ఆ ఎంటర్టైన్మెంట్ ను ఆడియన్స్ కు కూడా అందించాలనే ఈ కథను ఓకే చేసినట్టు తెలిపాడు. లైలా పాత్ర తన కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుందని విశ్వక్ ఈ సందర్భంగా చెప్పాడు.
లైలా గెటప్ మళ్లీ వెయ్యాలనిపిస్తుందని, సినిమాలో సీక్వెల్ కు సంబంధించిన మంచి క్లిప్ హ్యాంగ్ర్ సీన్ ఉందని, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో దాన్ని యాడ్ చేస్తామని చెప్పాడు విశ్వక్. లైలా క్యారెక్టర్ ను తాను చేయగలనని నిర్మాత సాహు ఎంతో నమ్మాడని, బడ్జెట్ గురించి ఏ విషయంలో రాజీ పడకుండా ఖర్చు పెట్టాడని, ఫ్యూచర్ లో కూడా తమ జర్నీ ఇలాగే కొనసాగుతుందని విశ్వక్ చెప్పాడు.