బాలీవుడ్ ను బయటివారే నిలబెడతారు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు అందుకుంటున్నాడు.;

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తన తర్వాతి సినిమాతో హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశ పడుతున్నప్పటికీ విజయ్ ఆశ మాత్రం ఆశగానే ఉండిపోతుంది. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో చేసిన లైగర్ దారుణమైన డిజాస్టర్ కాగా, ఫ్యామిలీ స్టార్ కూడా అదే రీతిలో ఫ్లాప్ గా నిలిచింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ గురించి, బాలీవుడ్ డౌన్‌ఫాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు బాలీవుడ్ ను పైకి తీసుకొస్తారని విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సౌత్ సినిమా సాధించిన ఘనత గురించి మాట్లాడుతూ విజయ్ బాలీవుడ్ గురించి కూడా మాట్లాడాడు.
సౌత్ సినీ ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తీరు గురించి మాట్లాడుతూ, బాలీవుడ్ కూడా మళ్లీ పూర్వ వైభోగాన్ని అందుకుంటుందని అన్నాడు. సౌత్ సినిమాకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని, ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలను చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, సౌత్ సినిమాలకు ఒకప్పుడు అసలు గుర్తింపు ఉండేది కాదని అన్నాడు.
సినీ ఇండస్ట్రీ ఒక సర్కిల్ లాంటిదని చెప్పిన విజయ్, రానున్న ఐదు- పదేళ్లలో పరిస్థితులు మారొచ్చని, బాలీవుడ్ లో ఉన్న లోటును ఫుల్ ఫిల్ చేసేందుకు కొత్త డైరెక్టర్లు వచ్చి బాలీవుడ్ స్థాయిని పెంచుతారనిపిస్తుందని, అయితే ఆ డైరెక్టర్లు ముంబైకు చెందిన వారు కాకుండా బయటి వారే అవుతారని తనకు అనిపిస్తోందని విజయ్ దేవరకొండ తెలిపాడు.
సౌత్ నుంచి బాహుబలి లాంటి మూవీ ఒకటి వస్తుందని బాలీవుడ్ ఎప్పుడూ ఊహించి ఉండదని, ఆ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారని, ఒక్కొక్కరు ఐదేళ్ల పాటూ బాహుబలి కోసం కష్టపడ్డారని, ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని చిత్ర యూనిట్ తో పాటూ తెలుగు సినిమా కూడా అందుకుందని, బాలీవుడ్ కూడా అలాంటివి చూసి ఇన్‌స్పైర్ అయి సక్సెస్ అవాలని విజయ్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మే 30న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.