అక్కినేని చియాన్ అఖిల్ హీరోగా నటించిన అఖిల్ ఆడియో వేడుక నిన్నటి రోజున హైదరాబాద్ గచ్చిబౌళిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో సెలబ్రిటీల ప్రశంసలతో అఖిల్ తడిసిముద్దయ్యాడు. అఖిల్ డెబ్యూ సినిమా ట్రైలర్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి.
ఈ వేడుకలు ఆద్యంతం అక్కినేని ఫ్యామిలీ అంతా అఖిల్ చెంతే ఉండి అన్నిపనుల్ని సజావుగా సాగేలా చేసింది. తండ్రి నాగార్జున అఖిల్ ని కంటికి రెప్పలా కాచుకున్నారు. అఖిల్ మదర్ అమల తన కొడుకు గురించి ఏమాత్రం మాట్లాడకపోయినా కనులారా అతడి వైభవాన్ని తిలకించారు. సుమంత్ - సుశాంత్ అయితే అఖిల్ ని ఓ సూపర్ స్టార్ అంటూ ఎగ్జయిటింగ్ గా మాట్లాడారు. తాము చేయలేనిది అఖిల్ చేసి చూపిస్తాడని, ఏఎన్నార్ లెగసీని కొనసాగిస్తాడని ప్రశంసించారు. నాగచైతన్య అయితే నాకు ఏది కావాలన్నా తమ్ముడినే అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. ఆడియో వేడుక ఆద్యంతం పక్కా ప్రీ ప్లాన్డ్. అఖిల్ కేంద్రకంగా ప్రతి ఒక్కరూ అదరగొట్టే స్పీచ్ లు ఇచ్చారు. అయితే నాగార్జున ఈసారి ఇంత పెద్ద రేంజులో ప్లాన్ చేయడానికి కారణమేంటి? గతానుభవాలే కారణమా? అంటే అవుననే అందరూ అంటున్నారు.
నాగచైతన్య తెరంగేట్రం చాలా సాధాసీధాగా జరగిపోయింది. అతడి ఎంట్రి జోష్ సినిమాతో చాలా సింపుల్ గా జరిగింది. ఆ సినిమా విషయంలో నాగార్జున అస్సలు వేలు పెట్టలేదు. పూర్తిగా బాధ్యతలన్నీ నిర్మాత దిల్ రాజుకే అప్పజెప్పారు. అయితే దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఆడలేదు. పరాజయం పాలైంది. ఆ తర్వాత చైతూ కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. పైగా ఓ స్టార్ హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన పద్ధతి అది కాదు.. అని నాగార్జున రియలైజ్ అయ్యారు. కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడంలో బెల్లంకొండనే ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నాడో ఏమో .. టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టాడు. దీనిక నితిన్ నిర్మాత అయ్యాడు. దాదాపు 40 కోట్ల పెట్టుబడితో అఖిల్ తెరకెక్కింది. ఈ సినిమా లో అన్ని కమర్షియల్ అంశాలు ఏరి కూర్చాడు వినాయక్. అఖిల్ ని ఓ రియల్ హీరోలానే చూపించాడు. ఇప్పుడు అఖిల్ సినిమా రిలీజ్ కి ముందే సూపర్ స్టార్. అతడి చుట్టూ కార్పొరెట్ కంపెనీలు క్యూకడుతున్నాయి. తొలి సినిమా రిలీజ్ కి ముందే అతడు 50కోట్ల వసూళ్లు తెచ్చే హీరో గా పాపులర్ అయిపోయాడు. అందుకు తగ్గట్టే నిన్నటి ఆడియో వేడుక ఘనంగా జరిగింది.
అఖిల్ మరో సూపర్ స్టార్ అన్న విషయాన్ని విజువల్స్ చెప్పాయి. డ్యాన్సులు - ఫైట్స్ - మాటతీరు - నటన అన్ని విభాగాలలో అఖిల్ రేంజ్ మామూలుగా లేదు. ప్రిన్స్ తర్వాత మళ్లీ అంతటివాడే అనిపించాడు. అయితే ఏ హీరో భవిష్యత్ ని అయినా ఒకే ఒక్క సినిమా నిర్ణయించదు. అఖిల్ సెలక్షన్స్ - ఫ్యూచర్ ప్లానింగ్స్ ని బట్టి అతడు సూపర్ స్టార్ అవుతాడా? అవ్వడా ? అన్నది నిర్ణయించబడుతుంది. కాని ఇప్పటివరకు జరిగనదంతా మాత్రం.. వాటే ప్లానింగ్ నాగార్జున గారూ!!