2021 ముగింపు అక్కినేని అభిమానులకు చేదుగుళికనే మిగిల్చింది. 2022 ను కొత్త ఉత్సాహంతో ప్రారంభించేందుకు వారికి మనసొప్పలేదు. ఎందుకంటే సమంత నుంచి నాగచైతన్య విడిపోవాల్సిన పరిస్థితులే దీనికి కారణం. ఈ ఉదంతంపై కింగ్ నాగార్జన ఇన్నాళ్లు ఎంతో సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ ఇప్పటికి సమయం వచ్చింది.. ఆయన మాట్లాడారు. సమంత అక్కినేని నుండి విడాకులు తీసుకున్న తర్వాత తన కొడుకు నాగ చైతన్య విషయంలో తాను చాలా ఆందోళన చెందానని తాజాగా అక్కినేని నాగార్జున చెప్పారు. చైతన్య-సమంతలు గత సంవత్సరం తమ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. వారు విడిపోవడానికి సంబంధించి ఒకే విధమైన పోస్ట్ లను పంచుకున్నారు. కానీ సమంతపై నిందించే పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో చైతూ సైలెంట్ గా మదనంలోనే ఉండిపోయారు.
అనంతరం ఇటీవలే నాగ చైతన్య దానిపై వ్యాఖ్యానించాడు. తాము విడిపోవడమే సరైన నిర్ణయమని చైతూ అన్నారు. తాజాగా నాగార్జున తన కొడుకు చైతన్య విడాకుల ప్రక్రియలో తనను తాను ఎంత బ్యాలెన్స్ డ్ గా మ్యానేజ్ చేయగలిగాడో తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఏమన్నారంటే.. ``అన్నింటిలో చై ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూశాక నాకు చాలా గర్వంగా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరు తండ్రుల్లాగే నేను అతని గురించి చాలా ఆందోళన చెందాను. కానీ తన గురించి నా కంటే .. అతడు నా గురించి ఎక్కువగా బాధపడ్డాడు. చైతన్య నన్ను ``నువ్వు బాగున్నావా.. నాన్న?`` అని అడిగేవాడు. ``నేను నిన్ను అడగవలసినది అది కాదా?`` అని అనుకునేవాడిని.. అన్నారు నాగార్జున.
చైతన్యతో కలిసి నాగార్జున నటించిన తాజా చిత్రం బంగార్రాజు ప్రమోషన్స్ సందర్భంగా కొంతమంది పాత్రికేయులతో మాట్లాడుతూ.. నాగ చైతన్య - సమంతల విడాకుల గురించి మాట్లాడాడు. ఆమె సంతోషంగా ఉంటే తానూ సంతోషిస్తానని చెప్పాడు. ఈ సమయంలో విడాకులు తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
``విడిపోయినా ఫర్వాలేదు. అది వారి వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న పరస్పర నిర్ణయం. ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషిస్తాను. కాబట్టి అటువంటి పరిస్థితిలో విడాకులు తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయం`` అని అన్నారు.
ఇంతకుముందు సమంత తాను తరచుగా ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ఆమె విడాకుల నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక విధ్వంసం గురించి కూడా చెప్పింది. వారాలుగా ప్రచారంలో ఉన్న పుకార్లకు ముగింపు ఇస్తూ అక్టోబర్ 2021లో సమంత - చైతన్య తాము విడిపోయినట్లు ప్రకటించారు. ``2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతిదానితో నాకు ఎలాంటి అంచనాలు లేవు. నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే మిగులుతుందో దాని కోసం నేను సిద్ధంగా ఉన్నాను. దానికి నా బెస్ట్ ఇస్తాను`` అని సమంత తెలిపారు.