''అసలు బాహుబలి సినిమా వచ్చాక మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది. మన సినిమాల్లో ఉండాల్సిన గ్రాఫిక్స్ స్థాయి పెరిగింది. ఆడియన్సు నాసిరకం గ్రాఫిక్ వర్కును ఒప్పుకోవట్లేదు. అందుకే అఖిల్ సినిమాలో గ్రాఫిక్సు వర్కు బాగా రాలేదని సినిమాను రిలీజ్ చేయట్లేదు. ఒక్కసారి అది పూర్తవ్వగానే రిలీజ్ చేసేస్తాం'' అంటూ సెలవిచ్చారు కింగ్ నాగార్జున.
అసలు అఖిల్ సినిమా అక్టోబర్ 22న తీసుకురావట్లేదు అనగానే అభిమానులందరూ షాకయ్యారు. కొందరైతే నితిన్.. వినాయక్.. లకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు కూడా. అయితే ఇప్పుడు నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చేశారు. ''అఖిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా హిట్టే అవుతుంది. ఎందుకంటే సినిమా ఆ రేంజులో వచ్చింది. సో.. అఖిల్ ఎప్పుడు వస్తే అప్పుడు పండగే. డోంట్ వర్రీ'' అంటూ నాగ్ సినిమా గురించి కూడా ఒక మాటనేశారు.
ఎప్పుడైతే అఖిల్ సినిమాను పోస్టుపోన్ చేశారో.. రెండు కారణాలు బలంగా వినిపించాయి. ఒకటి.. బ్రూస్ లీ సినిమా వలన వచ్చే పోటీ ప్లస్ ధియేటర్ల కొరత.. రెండు.. అసలు నాగార్జున సినిమా క్లయ్ మ్యాక్స్ అస్సలు నచ్చకపోవడం. బహుశా ఓ 5 రోజులు రీషూట్ చేసే ఛాన్సుంది అంటున్నారు.