విడుదలకు ముందు కథ అంతా దాచిపెట్టి.. తెరమీద సర్ ప్రైజ్ చేయడం ఓ పద్ధతి. లేదా కథంతా ముందే విప్పేసి, ఎలాంటి సినిమా చూడబోతున్నామో ప్రేక్షకులకు ముందే ఓ అవగాహన వచ్చేలా చేసి.. తెరమీద వాళ్ల అంచనాలకు తగ్గ సినిమాతో సంతృప్తి పరచడం ఇంకో పద్ధతి. ఐతే తొలి పద్ధతిలో ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకే నాగార్జున అండ్ టీమ్.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయంలో రెండో పద్ధతే ఎంచుకుంది. ఈ సినిమా కథ, పాత్రల గురించి ఏమీ దాచుకోకుండా గుట్టంతా ముందే విప్పేస్తోంది. టీజర్లు - ట్రైలర్ల ద్వారా ఇప్పటికే దాదాపుగా కథంతా విప్పేయగా.. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో కూడా నాగ్ ఏమీ దాచుకోవట్లేదు.
టైటిల్ దగ్గర్నుంచి అన్ని విషయాల గురించీ ఓపెన్ గా మాట్లాడేస్తున్నాడు నాగ్. ‘‘బంగార్రాజు అనే పల్లెటూళ్లలో కనిపించే ఫ్లర్టింగ్ క్యారెక్టర్ నాది. అమ్మాయిలంటే చాలా మోజు. ఐతే ఆ పాత్ర చనిపోతుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల యముడు ఆ పాత్రను ఆత్మ రూపంలో భూమి మీదికి పంపిస్తాడు. ఆ పాత్ర తన భార్యకు తప్ప ఇంకెవరికీ కనిపించదు. మరోవైపు బంగార్రాజుకు పూర్తి వ్యతిరేకమైన పాత్ర అతడి కొడుకుది. అమాయకుడు. ఆ అమాయక చక్రవర్తి తండ్రి ఎలా మార్చాడు. గడుసువాడిగా మార్చి తన సమస్యలు పరిష్కరించుకునేలా ఎలా చేశాడన్నది ఈ కథ. సోగ్గాడే అనేది బంగార్రాజు పాత్ర అయితే.. చిన్నినాయనా అనేది కొడుకు పాత్రకు సంబంధించిన పేరు. ఆ సోగ్గాడే ఈ చిన్నినాయనా అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం’’ అంటూ కథ గురించి, పాత్రల గురించి వివరంగా చెప్పాడు నాగ్. మరి అన్నీ తెలుసుకుని థియేటర్లలో అడుగుపెట్టే ప్రేక్షకుడిని రెండున్నర గంటలు కూర్చోబెట్టడం కూడా అంత సులువేం కాదు. మరి ఈ విషయంలో ‘సోగ్గాడే..’ టీం ఏం మ్యాజిక్ చేసిందో చూద్దాం.