నాగ్‌ రీజనింగ్‌ అందరికీ వర్తిస్తుంది

Update: 2015-11-13 17:30 GMT
నిన్న కింగ్ నాగార్జున ఒక మంచి మాట చెప్పారు. ఒక కొత్త కుర్రాడిని రేట్‌ చేసేటప్పుడు ఒక కొత్త కుర్రాడిలాగానే రేట్‌ చేయాలి. అలాగే ఒక యాక్టర్‌ ను రేట్‌ చేసేటప్పుడు ఒక యాక్టర్‌ గానే రేట్‌ చేయాలి. అందుకే ఆయన అఖిల్‌ ను ఒక యాక్టర్‌ గా రేటింగ్‌ చేయలేను.. ఒక కొత్త కుర్రాడిగా మాత్రం రేట్‌ చేస్తాను.. 10 సినిమాలు పోయాక అన్నింటిలో ఇంప్రూవ్‌ అవుతాడు అని చెప్పారు. ఇందులో చాలా పెద్ద ఫిలాసఫీ దాగుంది.

నిజానికి నాగ్‌ చెప్పిన విషయంలో ఎంతోమంది నేర్చుకోవాల్సిన ఒక మర్మం ఉంది. ముఖ్యంగా సినిమా అనుకున్నంత రేంజులో సక్సెస్‌ అవ్వలేదని ఆయనకు కూడా తెలుసు.. కాకపోతే డబ్బుల లాస్‌ ను పక్కనెట్టేసి కేవలం ఈ 'అఖిల్‌'లోని పాజిటివ్‌ పాయింట్‌ మాత్రమే ఆయన చూశారు. అదొక రీజనింగ్‌. ఇకపోతే ఎవరి స్థాయి ఎంత అనేది వాదించుకుంటే పోతే అప్పుడు సోషల్‌ నెట్వర్కులో కేవలం తమ పంతం కోసం వాదించే కొందరు ఫ్యాన్సుకూ క్రిటిక్సుకూ తేడా ఉండదు. ఎందుకంటే కేవలం స్థాయినిబట్టి సినిమాలను చూస్తేనే వాటిని విశ్లేషించగలుగుతాం. అంతేకాని.. రేంజ్‌.. హైప్‌.. స్టార్డమ్‌ అంటూ పోతే మాత్రం సరైన విశ్లేషణలు అందించలే అని నాగ్‌ చెప్పకనే చెప్పారు.

బాహుబలి - శ్రీమంతుడు మాంచి కమర్షియల్‌ సినిమాలు. అవన్నీ 100 కోట్ల పైమాటే వసూలు చేసాయి కాబట్టి ఇండియా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ఎంపిక కాలేదని ఫీలవక్కర్లేదు. వాటి స్థాయి ఫిలిం ఫెస్టివల్‌ కు సరిపోదని పాజిటివ్‌ గా తీసుకోవచ్చు. అందులో తెలుగు సినిమాల మీద కక్ష కట్టేశారనో.. లేకపోతే తెలుగు దర్శకులు జ్యూరీలో ఉండీ కుళ్ళుతో ఈ సినిమాలను సెలక్టు చేయలేదనో ఫేస్‌ బుక్‌ వాల్‌ పైన పెద్ద పెద్ద రాతలు రాయల్సిన అవసరం లేదు.. నాగ్‌ మాటల్లోని రీజనింగ్‌ అర్ధమైతే.

Tags:    

Similar News