బాక్సాఫీస్ ఫలితం నెగెటివ్ అయితే ఆ పరిణామాలే వేరుగా ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ కిడ్ అయినా ఒత్తడిని ఎదుర్కోవాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి అంతటివారే .. బాక్సాఫీస్ రిజల్ట్ ఫెయిలైనప్పుడు అభిమానులకు - బయ్యర్లు - డిస్ర్టిబ్యూటర్లకు సమాధానం చెప్పుకోవాల్సొచ్చేది. కొన్ని సందర్భాల్లో కొందరు హీరోలు నష్ట నివారన కోసం చేతి చమురును వదిలించుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే అలాంటి పరిస్థితి రాలేదు కానీ.. ఇటీవలే రిలీజైన అఖిల్ మూవీ అక్కినేని ఫ్యామిలీకి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాల్నే తెచ్చింది. అఖిల్ ప్రస్తుతం ఫ్యాన్స్ కి - డిస్ర్టిబ్యూటర్లకు జవాబుదారీ అవ్వాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ కోపతాపాల్ని చల్లార్చేందుకు కింగ్ నాగార్జున రంగంలోకి దిగారని తెలుస్తోంది. అఖిల్ మూవీ వల్ల డిస్ర్టిబ్యూటర్లకు 50శాతం నష్టాలొచ్చాయని చెబుతున్నారు. 25 శాతం వరకూ అయితే ఓకే, అంత పెద్ద మొత్తాల్ని భరించాలంటే కష్టం అంటూ కొందరు పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేశారని చెబుతున్నారు. అయితే ఇలాంటి పంపిణీదారులందరినీ పిలిచి నాగార్జున ఓ రహస్య మీటింగుని ఏర్పాటు చేసి, మునుముందు రిలీజయ్యే అక్కినేని సినిమాల్ని రీజనబుల్ రేటుకే ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
డ్యామేజ్ కంట్రోల్ కోసం కింగ్ స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. కొడుకుల లాంచింగ్ కోసం స్టార్ హీరోల్లో నాగ్ పడినంత కష్టం ఎవ్వరూ పడుండరు నిజంగా.