తెలుగు సినిమా గతిని మార్చేసిన 'శివ' సినిమా ఇటీవలే 25 వసంతాల పండుగను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ సినిమాకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ సినిమా కల్ట్ జోనర్‌లో వచ్చిన క్లాసిక్. అక్టోబర్ 5, 1989లో రిలీజ్ చేశారు. అప్పటివరకూ ఉన్న మూసఫార్ములాకి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలనమే అయ్యింది. శివ తర్వాత శివ ముందు అని మాట్లాడుకున్నారంటే .. అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాని ఇప్పుడు డిజిటలైజ్ చేసి రీటచ్ ఇచ్చి మరోసారి రిలీజ్ చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. మే 15న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తునన్నారని సమాచారం. కింగ్ నాగార్జున అభిమానులకు, రామ్‌గోపాల్ వర్మ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. శివ సినిమాని తెరకెక్కించే విషయంలో అన్ని రూల్స్‌ని పక్కనపెట్టేసి పనిచేశామని రామూ 25ఏళ్ల పండుగలో చెప్పాడు.
నాగార్జున స్టయిల్ మార్చి, సినిమా తీరు తెన్నుల్లో నేచురాలిటీ కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. బహుశా .. రొటీనిటీ లేకపోవడం, స్క్రీన్‌ప్లేలో క్లారిటీ.. ఈ సినిమా ఘనవిజయానికి కారణం అయ్యింది. ఇప్పుడు మరోసారి రెన్యువల్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి నాగ్ అభిమానుల్లో విపరీతమైన క్రేజు ఉంటుందన్నమాట!