అక్కినేని నాగార్జున చాలా రేర్ గానే బయట జరిగే ఈవెంట్లకు హాజరవుతుంటారు. భార్య అమల..కుటుంబ సభ్యులు నిర్వహించే ఛారిటీ పనులు..ఇతర సెలబ్రేషన్స్ లో మాత్రమే నాగార్జున కనిపిస్తుంటారు. ఇంకా బాగా కావాల్సిన వ్యక్తులైతే ఆ వేడుకలకు హాజరుఅవుతుంటారు. తాజాగా అలాంటి సందర్భమే నిన్నటి రోజున చోటు చేసుకుంది. అక్కినేని ఫ్యామిలి ఫ్రెండ్..నాగార్జునకు సన్నిహితుడైన శ్రీధర కుమారుడి అభిశ్రీ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు నాగార్జున సైతం హాజరై అభిశ్రీకి బర్డ్ డే విషెస్ తెలియజేసారు. అక్కడి హంగామా చూస్తే సెలబ్రేషన్స్ భారీ ఎత్తునే జరిగినట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున బ్లాక్ టీషర్ట్ మ్యాచింగ్ జీన్స్ ధరించారు. బ్లాక్ కారులోంచి నాగార్జున దిగిన వెంటనే శ్రీధర్ కింగ్ కి వెల్కమ్ చెప్పి లోపలికి ఆహ్వానించారు. అనంతరం నాగార్జున శ్రీధర్ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు.
ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది నిజంగా చాలా రేర్ మూవ్ మెంట్. ఇలాంటి ఈవెంట్లకు సెలబ్రిటీలు హాజరైతే కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. కానీ తప్పని పరిస్థితుల్లో హాజరవ్వాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ కారణంగా నాగార్జున స్నేహితుడు కుమారుడి బర్డ్ డే కోసం హాజరైనట్లు తెలుస్తోంది.
కింగ్ నాగార్జున బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'వైల్డ్ డాగ్' తర్వాత ఇటీవలే 'బంగార్రాజు'తో మరో కమర్శియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. దుబాయ్ లో షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ లోకేషన్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ లోని మండే ఎండల నడుమ 'ఘోస్ట్' చిత్రీకరణ జరుపుతున్నారు.
కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి నాగార్జున ఖాళీ సమయంలో చర్చలు జరుపుతున్నారు. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాలన చూస్తున్నారు. ఇమేజ్ ని బట్టి ఇన్నోవేటివ్ స్ర్కిప్ట్ ల్ని నాగార్జున ఇతర హీరోలకు రిఫర్ చేస్తున్నట్లు సమాచారం.
అటు కుమారుడు అఖిల్ సినిమాలపైనే ఓ కన్నేసి పని చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలోనూ నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని సూరికి తరుచూ టచ్ లో ఉంటున్నారుట.