నాగార్జున టాటూ ఏమైంది..?

Update: 2017-02-10 04:55 GMT
‘మన్మథుడు’ రోజుల్లో నాగార్జున తన జబ్బపై వేయించుకున్న టాటూ ఎంతగా అభిమానుల్ని ఆకర్షించిందో తెలిసిందే. అప్పట్లో నాగ్ అభిమానులకు ఈ టాటూ బాగా నచ్చేసి వాళ్లు కూడా ఆయన్ని ఫాలో అయిపోయారు. యూత్ కు అప్పట్లో ఇదొక స్టైల్ స్టేట్మెంట్ లాగా అయింది. ఆ తర్వాత కూడా నాగ్ ఆ టాటూను కొనసాగించాడు. నాగ్ ఎప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్సుల్లో కనిపించినా ఆ టాటూ దర్శనమిచ్చేది. ఐతే మామూలు సినిమాలకైతే ఇబ్బందేమీ లేదు కానీ.. ఏవైనా ఆధ్యాత్మిక చిత్రాల్లో కనిపిస్తేనే ఈ టాటూతో సమస్య. ఐతే శ్రీరామదాసు.. షిరిడి సాయి లాంటి సినిమాల్లో నాగ్ తన బాడీని పూర్తిగా బట్టలతో కప్పుకున్నాడు కాబట్టి ఇబ్బంది తలెత్తలేదు.

కానీ ‘ఓం నమో వెంకటేశాయ’లో హాథీరామ్ బావాజీ పాత్ర వేరు. దీని కోసం నాగ్ చాలా వరకు బేర్ బాడీతో కనిపించాల్సి ఉంటుంది. బావాజీ వస్త్రధారణ అలా ఉంటుంది మరి. ఈ నేపథ్యంలో నాగ్ తన టాటూను ఎరేజ్ చేయించి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. హాథీరామ్ బావాజీ ఒంటి మీద కప్పుకునే వస్త్రంతో ఆ టాటూను కవర్ చేయించేలా ప్లాన్ చేశాడు రాఘవేంద్రరావు. దీంతో ఆ టాటూ సినిమాలో ఎక్కడా కనిపించే అవకాశం లేదు. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ గమనిస్తే.. ఎక్కడా కూడా కుడి జబ్బ ఓపెన్ గా కనిపించదు. అన్ని చోట్లా దాన్ని కవర్ చేసే ఉంచారు. కాబట్టి సమస్య లేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News