కన్నడ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచి శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పునీత్ మరణం సినీ ఇండస్ట్రీల కలవరపరిచింది. పునీత్ అంత్యక్రియలకు స్వయంగా తెలుగు హీరోలు బాలక్రిష్ణ, చిరంజీవి, జూ.ఎన్టీఆర్, వెంకటేశ్ తదితరులు తరలివెళ్లి స్వయంగా నివాళులర్పించారు.
ఆ సమయంలో వెళ్లలేకపోయిన టాలీవుడ్ అగ్రహీరో కింగ్ నాగార్జున తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. బెంగళూరులోని సదాశివనగర్ లో గల పునీత్ నివాసానికి ఈరోజు మధ్యాహ్నం చేరుకున్న నాగార్జున పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పునీత్ ఫొటోకు నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
పునీత్ అకాల మరణాన్ని కన్నడిగులు..సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ హీరోలతో పునీత్ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ పరామర్శించగా తాజాగా నాగార్జున స్వయంగా వెళ్లి ఓదార్చారు.
పునీత్ రాజ్ కుమార్ తెలుగువాడు కాకపోయినా.. తెలుగులో నటించకపోయినా అతడిని మనవాడిలా భావించి తెలుగు వాళ్లందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మన ఇండస్ట్రీ జనాలు కూడా పునీత్ మరణం నేపథ్యంలో స్పందించిన తీరు కన్నడిగులను కదిలించింది. చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. పునీత్ ను టాలీవుడ్ ఇలా ఓన్ చేసుకొని అతడి మరణం పట్ల స్పందించిన తీరును కన్నడ ప్రజలు కొనియాడు.. ఇదే సమయంలో తమిళ హీరోలు ఒక్కరూ రాలేదని.. వారు స్పందించిన తీరు దారుణం అంటూ వారిపై ఆగ్రహంతో ట్రోల్స్ చేస్తున్నారు.
అక్టోబర్ 29న ఉదయం జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పలకూలిపోయాడు పునీత్. గుండెపోటుతోనే మరణించాడని డాక్టర్స్ తేల్చి చెప్పేసారు. గుండెపోటుతో అర్థాంతరంగా కన్నుమూసిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పునీత్ రెండో అన్న కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు,తోటి నటీనటులు హాజరయ్యారు.