#ChaiSam కొన్ని గంటల్లో నా కోడలు

Update: 2017-10-06 12:04 GMT
ఇప్పుడు కింగ్ నాగార్జున అక్కినేని.. తమ ఇంట్లో జరిగే పెళ్ళి తరుపున పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఆయన ఎక్సయిట్మెంట్ ఆపుకోలేక.. అసలు గోవాలోని హోటల్లో ఏం జరుగుతోందో లైవ్ అప్డేట్లను వరుసపెట్టి ఇచ్చేస్తున్నారు.

ఇకపోతే మరొ కొన్ని గంటల్లో చైతన్యతో మూడు ముళ్ళూ వేయించుకుని తన కోడలు కాబోతున్న సమంతతో.. కాస్త ముందుగానే నాగ్ ఒక ఫోజిచ్చేశారు. 'మొన్నటివరకు సార్ అని పిలిచేది.. ఇప్పుడు మామా అని పిలుస్తోంది' అంటూ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నా నాగ్.. ఇప్పుడు తన కోడలుతో కలసి ఎంతో ఆప్యాయంగా ఒక ఫోటో దిగి.. దానిని షేర్ చేశారు. మొత్తానికి తనకు ఇద్దరూ కొడుకులే కాబట్టి.. కూతుళ్లు లేని లోటును సమంత తీరుస్తుందేమో.

ఇక ఫోటోలో చూస్తుంటే.. సమంత స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న లెహంగాల్లో మెరిసిపోతోంది. పైగా ఆమె చంపల్లో తన ఆనందం తాలూకు ఛాయలను మనం గమనించవచ్చు. మరి త్వరలోనే సమంత అండ్ నాగ చైతన్య ఫోటోలను కూడా నాగ్ షేర్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News