ఎన్టీఆర్‌30 చేతులు మారడం పై నాగవంశీ వివరణ

Update: 2021-04-13 05:35 GMT
గత ఏడాది ఆరంభంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన ఆ సినిమాతో త్రివిక్రమ్‌ క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఆ సమయంలో త్రివిక్రమ్‌ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. గత ఏడాది ఆరంభంలోనే ఎన్టీఆర్‌ 30 సినిమాను త్రివిక్రమ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరి కాంబో సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఆలస్యం అవుతూ వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30 ఆలస్యం అవుతుందని.. ఎప్పుడైతే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా పూర్తి అవుతుందో అప్పుడు ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఎన్టీఆర్‌ 30 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ ప్రకటన రావడంతో పాటు వచ్చే ఏడాది సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా క్యాన్సిల్‌ అయ్యిందా లేదా వాయిదా పడిందా అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ట్విట్టర్‌ లో ఆయన ఈ విషయమై... కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్‌ 30 సినిమా మా బ్యానర్‌ లో రావడం లేదు. అయితే ఎన్టీఆర్‌ తో ప్రాజెక్ట్‌ కోసం తామంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు క్యాన్సిల్‌ అయినా రాబోయే రోజుల్లో మా బ్యానర్‌ లో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా ఆయన ట్వీట్‌ చేశాడు. అయితే ఎన్టీఆర్‌ తో ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యిందా లేదంటే వాయిదా పడిందా అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. దాంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు. త్రివిక్రమ్‌ తదుపరి సినిమా విషయమై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.




Tags:    

Similar News