ఫక్తు కమర్షియల్ ఫార్ములాని ఫాలో చేసే నాస్తికుడు ఆర్జీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కథానాయికల్ని ఆయన ఏనాడో వ్యాపార వస్తువుగా మార్చారు. కథానాయికల గ్లామర్ ఎలిమెంట్ ని ఉపయోగించి ఎన్ క్యాష్ చేయడం అన్నది ఊర్మిళ- రంగీలా డేస్ నుంచే అతడు అలవాటు పడినది. ఇప్పటికీ ఆయనలో అదే ఒరవడి.
ఇటీవల డేంజరస్ అంటూ ఇద్దరు డేంజరస్ లేడీస్ తో అతడి విన్యాసాలు ఫోటోషూట్లు వగైరా వగైరా తెలిసిన వ్యవహారమే. మియా మల్కోవా సహా ఎందరో కథానాయికలతో ప్రయోగాలు చేసిన ఆర్జీవీ.. ఇటీవల ఆ ఇద్దరు ఫేవరెట్ కథానాయికల్ని (నైనా గంగూలీ-అప్సర రాణి) విపరీతంగా ప్రమోట్ చేస్తున్న తీరు పరిశీలనకు వచ్చింది.
ఆ ఇద్దరి చేతా స్వలింగ సంపర్కుల కథతో `డేంజరస్` అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అతిగా ఎక్స్ పోజింగులు.. శ్రుతి మించిన పెదవి ముద్దులు చేయిస్తున్న ఆర్జీవీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అలా ఐఫోన్ చేతిలో ఉంది కదా అని ఫోటోషూట్లే ఫోటోషూట్లు అంటే ఎలా ఆర్జీవీ? కొంచెమైనా పద్ధతిగా ఒక్క ఫోటోషూట్ అయినా ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు అమాయక జనం.
ఆయన ఏం చేసినా కమర్షియల్ యాంగిల్ ఒక్కటేనా? కాస్తయినా సాంప్రదాయ బద్ధంగా ఏదీ ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన క్రియేటివిటీకి మాత్రం నైనా అప్సరలు విపరీతమైన కాంప్లిమెంట్లు ఇచ్చేస్తూ బోలెడంత ఎంకరేజబుల్ గా ఉండడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అన్నట్టు ఆర్జీవీ తీస్తున్న సినిమాలన్నీ ల్యాబుల వరకేనా.. రిలీజ్ కి నోచుకోవా? అని ట్రేడ్ లోనూ గుసగుస వినిపిస్తోంది. మరి అన్ని ప్రశ్నలకు టోకున వర్మ ఆన్సర్స్ ఇస్తారేమో చూడాలి.