నవతరం హీరోలతో పరిమిత బడ్జెట్ లో సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన. తనీష్ తో `మేం వయసుకు వచ్చాం`.. రాజ్ తరుణ్ తో `సినిమా చూపిస్త మావ` పెద్ద హిట్లుగా నిలిచాయి. నాని హీరోగా తెరకెక్కించిన `నేను లోకల్` చిత్రానికి క్రిటిక్స్ విమర్శలు ఎదురైనా కమర్షియల్ విజయం దక్కింది. ఆ క్రమంలోనే త్రినాథరావుకు కొంత గుర్తింపు పెరిగింది. అయితే 2018లో రామ్ హీరోగా తెరకెక్కించిన `హలో గురూ ప్రేమకోసమే` పరాజయం పాలవ్వడం పెద్ద సెట్ బ్యాక్ కూడా అయ్యింది. అయినా అతడికి తాజాగా విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కిందన్న సమాచారం ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.
గత కొంతకాలం క్రితమే వెంకీకి కథ చెప్పి ఓకే చేయించుకున్న త్రినాథరావు నక్కిన ఎట్టకేలకు జాక్ పాట్ పట్టేశాడట. ఇక సెట్స్ కి వెళ్లడమే ఆలస్యం అని తెలుస్తోంది. ఇప్పటివరకూ స్మాల్ టైమ్ సినిమాలతో నెట్టుకొచ్చిన అతడు తొలిసారి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.. లక్కీ గయ్! అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే అతడికి ఈ ఛాన్స్ ఎలా దక్కింది? అంటే.. వెంకీతో శ్రీవాస్ తెరకెక్కించాల్సిన `దేదే ప్యార్ దే` రీమేక్ సినిమాని ప్రస్తుతానికి ఆపేశారు. శ్రీవాస్ మరో కొత్త కథతో వచ్చాకే వెంకీతో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ఆల్మోస్ట్ సెట్స్ కెళుతున్నారు అనుకుంటుండగా శ్రీవాస్ సినిమా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? అంటే దీనిపై `మన్మధుడు 2` ఫెయిల్యూర్ ప్రభావం పడిందన్నది ఇన్ సైడ్ టాక్. `దేదే ప్యార్ దే` కథాంశం ఇంచుమించు అదే తీరుగా ఉంటుంది. ఏజ్ బార్ యువకుడితో తక్కువ వయసు అమ్మాయి ఎఫైర్ సాగించే కథ అది. మన్మధుడు 2 కథను రాహుల్ రవీంద్రన్ ఇంచుమించు అదే కథతో తెరకెక్కించాడు. రిజల్ట్ ఏమిటో తెలిసిందే. అందుకే వెంకీ ఈ ప్రాజెక్టును వెనక్కి నెట్టారట. అలా త్రినాథరావు నక్క తోక తొక్కినట్టయ్యింది! అంటూ మాట్లాడుకుంటున్నారు.
అయితే త్రినాథరావు ఏమైనా తక్కువ తిన్నాడా? అంటే.. అతడిలో ప్రతిభకు కొదవేమీ లేదని వెంకీ భావిస్తున్నారట. దిల్ రాజు- బెక్కం వేణుగోపాల్ లాంటి మార్కెటింగ్ నైపుణ్యం ఉన్న నిర్మాతలు కం పెర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తెలిసిన వాళ్లతో పని చేశాడు కాబట్టి ఆ స్కిల్స్ అతడికి ప్లస్ అవుతున్నాయని చెబుతున్నారు. సరళమైన కథాంశాన్ని ఎంచుకుని ఎంతో సింపుల్ గా సినిమాలు తీయడం త్రినాథరావు ప్రత్యేకత. అదే అతడికి ప్లస్ అవుతోందట.