నందుల ర‌చ్చ‌లోకి క‌మ‌ల్ ను తీసుకొచ్చేశారు

Update: 2017-11-17 07:42 GMT
ఉరిమి.. ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్లు.. నందుల గొడ‌వ‌లో ఏ మాత్రం సంబంధం లేని ఒక అగ్ర‌న‌టుడ్ని చ‌ర్చ‌లోకి లాగ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల వ్య‌వ‌హారం తెలుగు సినిమా ఇంద‌స్ట్రీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ చ‌ర్చ‌కు తెర తీసింది.

ఈ అంశంపై ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌త్యేక చ‌ర్చ‌ను పెట్టింది. దీనికి.. తెలుగు సినీ నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి.. సి. క‌ల్యాణ్‌.. బండ్ల గ‌ణేశ్.. త‌దిత‌రులు చ‌ర్చ‌లో పాల్గొన్నారు.  నంది అవార్డుల ఎంపిక‌లో క‌మ్మ లాబీయింగ్ ప్ర‌భావం చూపింద‌న్న భారీ ఆరోప‌ణ‌తో పాటు.. కావాలంటే జ్యూరీలో ఉన్న వారి పేర్లు ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన వారో లెక్క చూడండంటూ బాహాటంగా చెప్పేయ‌టం క‌నిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ చ‌ర్చ‌లోకి అగ్ర‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. జ‌య‌ల‌లిత బ‌తికి ఉన్న‌ప్పుడు నోరు ఎత్త‌ని క‌మ‌ల్ హాస‌న్ ఆమె మ‌ర‌ణించిన త‌ర్వాత మాత్రం నీతులు చెబుతున్నార‌ని.. మ‌రి ఇదే నీతులు జ‌య‌ల‌లిత బ‌తికి ఉన్న‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌లేదంటూ కొత్త పాయింట్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

జ‌య మ‌ర‌ణం త‌ర్వాతే క‌మ‌ల్ కు త‌మిళ‌నాడులోని స‌మ‌స్య‌లు.. ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయా? అంత‌కు ముందు క‌నిపించ‌లేదా? అంటూ కొత్త టాపిక్ ను తెర మీద‌కు తెచ్చేశారు. నంది అవార్డుల ర‌చ్చ ఏమో కానీ.. తెలుగు ప్రాంతానికి సంబంధం లేని అంశాలు కూడా హాట్ హాట్ చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఇష్యూ క్లోజ్ అయ్యే నాటికి మ‌రెన్ని కొత్త ముచ్చ‌ట్లు వ‌స్తాయో?
Tags:    

Similar News