ఈ ఏడాది ప్రారంభానికి ముందు నుంచినే వివాదాలు రేపిన బిగ్ బాస్ వ్యవహారం ఇప్పటికే కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో పై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆ కార్యక్రమం అసంబద్ధంగా ఉందని, అనైతికంగా ఉందని దాన్ని నిషేధించాలంటూ పలు పిటిషన్లు కోర్టుకు చేరాయి. ఆ కార్యక్రమానికి సెన్సార్ విధించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు,
అయితే ఆ పిటిషన్లు విచారణలో ఉండగానే ఆ కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంది.అయితే బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది అలాంటి వివాదాలే..కాబట్టి వాటిని వారు ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే మరోవైపు వారి చాపకిందకే నీళ్లు వచ్చాయి. బిగ్ బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమె బిగ్ నిర్వాహకులు శ్యామ్ - రఘు - శశికాంత్ లపై కంప్లైంట్ ఇచ్చారు.
వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. వారు పోలీసులకు లొంగిపోలేదు. పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంతలో నాంపల్లి కోర్టును ఆశ్రయించి వారు ముందస్తు బెయిల్ పొందారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే స్టార్ మా ముఖ్య నిర్వాహకులకు కూడా పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.