నమ్రత షేర్ చేసింది.. మళ్లీ వైరల్‌ అయ్యింది

Update: 2022-09-12 07:34 GMT
ఈమధ్య కాలంలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఆయన యంగ్ లుక్ లో కనిపించడం చాలా సహజమైన విషయం. కానీ ఈమధ్య కాలంలో ఆయన గడ్డం లుక్ లో కనిపిస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. అంతే కాకుండా జనాలకు ఒకింత ఆశ్చర్యం ను కూడా కలిగిస్తున్నాడు అనడంలో సందేహం లేదు.

తాజాగా నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో మళ్లీ వైరల్‌ అయ్యింది. ఇటీవల కాలంలో నమ్రత మహేష్ బాబు యొక్క ఫోటోలను షేర్ చేయడం.. ఆ ఫోటోలు వైరల్‌ అవ్వడం కామన్‌ గా మారింది. ఇప్పుడు మహేష్ బాబు గడ్డం మరియు కొత్త హెయిర్ స్టైల్‌ లుక్ కూడా వైరల్‌ అవుతోంది. త్రివిక్రమ్‌ సినిమా కోసం మహేష్ బాబు ఇలా గడ్డం పెంచుతున్నాడు అనేది టాక్‌.

ఆ విషయం పక్కన పెడితే మహేష్ బాబు వయసు రోజు రోజుకు తగ్గుతుందా అన్నట్లుగా ఎప్పుడు అనిపించే విధంగానే ఈ ఫోటోను చూస్తుంటే కూడా అనిపిస్తుంది. ఇంకా ముప్పై లో అడుగు పెట్టని హీరో మహేష్‌ బాబు అంటే ఈ ఫోటోను చూస్తే తెలియని వారు నమ్మేస్తారేమో. ఆయన యొక్క అందం అలాంటిది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మహేష్‌ బాబు 28వ సినిమాకు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది. చాలా కాలంగా సినిమా ఏర్పాట్లు జరుగుతున్నాయి. షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసిన తర్వాత టాలీవుడ్ నిర్మాతల బంద్ కారణంగా ఆగస్టులో షూటింగ్‌ మొదలు పెట్టలేక పోయారు. ఈ నెలలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్‌ కాస్టింగ్‌ ఉండబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News