నమ్రతా శిరోద్కర్ అంటే తెలియని వారుండరు. 1993 లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన నమ్రతా.. 'జబ్ ప్యార్ కిసీసే హోతాహై' అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో దాదాపు ఇరవై చిత్రాల్లో నటించిన ఈమె.. కన్నడ, మలయాళ భాషల్లోనూ పని చేసింది. అలాగే బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'వంశీ' మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ మూవీ సమయంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రతల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారి తీసింది. 2005, ఫిబ్రవరి 10న ముంబైలో చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల నడుమ మహేశ్, నమ్రతలు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నటనకు గుడ్ బై చెప్పి ఇంటికే పరిమితం అయిన నమ్రతా.. గౌతమ్ కృష్ణ, సితారలకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం నమ్రతా ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు మహేశ్ బాబు మూవీ డేట్స్, ఆయన సినిమాలకు పబ్లిసిటీ వ్యవహారాలు, బిజినెస్ లు చూసుకుంటున్నారు. అలాగే మహేశ్ బాబు స్థాపించిన జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను సైతం ఆమెనే దగ్గరుండి నడిపిస్తున్నారు. అయితే పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత నమ్రతా రీ ఎంట్రీ ఇస్తుందని ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి.
కానీ, ఆ వార్తలను ఆమె ఖండిస్తూనే వచ్చింది. అయితే తాజాగా రీ ఎంట్రీపై మరోసారి నమ్రతా క్లారిటీ ఇచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో తన ఫ్రెండ్స్ ప్రారంభించిన స్టైలింగ్ స్టోర్ ఆవిష్కరణకు నమ్రతా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'అభిమానులకు తెరపై మళ్లీ నన్ను చూడాలనుంది. కానీ నేను వాళ్లను హర్ట్ చేస్తూనే ఉన్నాను.
ప్రస్తుతం నేను నా ఫ్యామిలీని చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నా. అది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అందుకే సినిమాల వైపు దృష్టి పెట్టడం లేదు, పెట్టే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు' అని పేర్కొంది. అలాగే మహేశ్ గురించి చెబుతూ.. షూటింగ్స్ నుంచి ఫ్రీ టైమ్ దొరికిందంటే ఆయనతో టూర్స్ వేసేస్తుంటామని, షాపింగ్ లు చేస్తామని, నచ్చింది తింటామని చెప్పుకొచ్చింది.
అయితే మహేశ్ ను వెంటేసుకుని షాపింగ్ చేయడం మాత్రం ఎప్పుడూ కుదరట. ఆయన షాపింగ్ కూడా నమ్రతనే చేసేస్తుందట. ఆమె కోసం మహేశ్ ఏ షాపింగ్ చేయడని, మహేశ్ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని అంటోంది నమ్రత. ఇక తనకు దుబాయ్, అమెరికాలో షాపింగ్ చేయడం అంటే మహా ఇష్టమని ఆమె పేర్కొంది.