ట్రోలర్ పై సూపర్ సెటైర్ వేసిన నమ్రత!

Update: 2019-05-11 07:46 GMT
సెలబ్రిటీలు అన్న తర్వాత ట్రోల్స్ ను తప్పించుకోవడం వీలు కాదు.  ఏదో ఒక సందర్భంలో ట్రోల్స్ బారిన పడాల్సి వస్తుంది.  అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ట్రోల్స్ ను ఎంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేశారనే దానీపై ఆ సెలబ్రిటీ మెచ్యూరిటీ లెవెల్స్ తెలుస్తాయి. ట్రోల్ చేసినవారిపై బూతుల దండకం అందుకోవడం ఎవరైనా చేయగలరు కానీ మర్యాదగా వారిని నోరు మూయించడం ఒక కళ.  అది చాలా తక్కువమందికే ఉంటుంది.  ఇప్పుడు అలాంటి వారి లిస్టులో మహష్ బాబు సతీమణి నమ్రత కూడా జాయిన్ అయ్యారు.

మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఈమధ్యే రిలీజ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులతో.. సన్నిహితులతో నమ్రత  సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.  దీంతో ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  అయితే ఈ సెలెబ్రేషన్ ఇంట్లో చేసుకున్నది కావడం తో నమ్రత చాలా క్యాజువల్ లుక్ లో.. మేకప్ లేకుండా ఉన్నారు. దీని పై ఒక నెటిజనుడు "నమ్రత.. ఎందుకు నువ్వు మేకప్ వేసుకోవు.. నువ్వేమైనా డిప్రెషన్ తో బాధ పడుతున్నావా" అంటూ కాస్త దురుసుగా కామెంట్ చేశాడు.

దీనికి స్పందనగా "మేకప్ తో ఉన్న మహిళలు నీకు నచ్చుతారేమో.. అందుకే నీ అభిరుచికి తగ్గట్టు ఎప్పుడూ మేకప్ వేసుకొనే వారిని ఫాలో అయితే బాగుంటుంది.  ఈ పేజ్ లో అలాంటివి ఉండవు.  అందుకే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే..  ఇది వదిలేస్తే మంచిది" అంటూ సాఫ్ట్ పంచ్ ఇచ్చింది.  అయినా ఆ నెటిజనుడు మేకప్ గురించి నమ్రతకే చెప్పాలా? 1993 లోనే నమ్రత మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించింది.  తెలుగు సినిమాల్లో కూడా నటించింది.  ఎప్పుడు మేకప్ వేసుకోవాలో.. ఎప్పుడు సహజంగా ఉండాలో నమ్రతకు తెలియకుండా ఉంటుందా?  ఏదేమైనా నమ్రత ఇచ్చిన తెలివైన సమాధానానికి నెటిజనుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.
    

Tags:    

Similar News