బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది తనూ శ్రీ దత్తా వల్ల అనే విషయం తెల్సిందే. 2008వ సంవత్సరంలో ఓకే హార్న్ ప్లీజ్ సినిమా షూటింగ్ సందర్బంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుండి మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎంతో మంది ప్రముఖుల పేర్లు లైంగిక వేదింపుల కేసుల్లో వచ్చాయి. అయితే ఇప్పటికే కొందరికి క్లీన్ చీట్ దక్కగా తాజాగా నానా పటేకర్ కు క్లీన్ చీట్ దక్కిందట.
నానాకు క్లీన్ చీట్ వచ్చిందని.. తనూ శ్రీ దత్తా ఆరోపణలను నిరూపించడంలో విఫలం అయ్యింది అంటూ కొన్నాళ్ల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో వెంటనే తనూశ్రీ దత్తా రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. ఇలాంటి సమయంలో నానా పటేకర్ పీఆర్ టీం ఇలా మీడియాలో ప్రకటనలు చేస్తున్నారంటూ మండి పండింది. కేసు ఇంకా ఎటూ తేలకుండానే ఆయనకు క్లీన్ చీట్ ఎలా లభించిందని ప్రశ్నించింది.
అది జరిగి నెలలు గడుస్తుంది. ఈ సమయంలో మరోసారి నానా పటేకర్ కు క్లీన్ చీట్ వచ్చిందని... కోర్టు తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో నానాకు క్లీన్ చీట్ ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో తనూశ్రీ దత్తా క్లీన్ చీట్ అంటూ వచ్చిన వార్తలపై స్పందించి కొట్టి పారేసింది. మరి ఈ సారి ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.