అసలు లైంగిక వేదింపులు అంటే ఏంటీ?

Update: 2018-09-27 16:50 GMT
ఈమద్య కాలంలో మీడియాలో లైంగిక వేదింపుల గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది. గతంలో లైంగిక వేదింపులకు గురైనా కూడా మీడియా ముందుకు వచ్చే వారు కాదు. కాని ఇప్పుడు సెలబ్రెటీలు లైగింక వేదింపులకు వ్యతిరేకంగా గట్టిగానే పోరాడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ తను శ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తనపై నానా పటేకర్‌ లైంగిక దాడికి పాల్పడ్డట్లుగా ఆమె ఆరోపిస్తోంది. బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయిన ఈ విషయమై తాజాగా నానా పటేకర్‌ స్పందించాడు.

ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. అసలు లైంగిక వేదింపులు అంటే ఏంటీ? నేను అసభ్యంగా ఆమెతో ప్రవర్తించాను అంటున్న సమయంలో అక్కడే 50 నుండి 100 మంది వరకు ఉన్నారు. చుట్టు అంత మంది ఉన్న సమయంలో నేను లైంగిక దాడికి ప్రయత్నించినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ అబద్దపు ఆరోపణలను నేను చట్టబద్దంగా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాను అన్నాడు.

తప్పులు చేస్తూ వాటిని కప్పి పుచ్చుకునేందుకు సమాజ సేవ కలరింగ్‌ చేస్తాడని తనుశ్రీ దత్తా ఆరోపించడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నానా పటేకర్‌ స్పందిస్తూ.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుకునే హక్కు ఉంది. నా మటుకు నేను కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులను చైతన్య పర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నేను చేసే పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న నానా పటేకర్‌ ఇలా లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పలువురు సినీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News