తెలంగాణలో సినిమా షూటింగ్స్ కు అనుమతులు కల్పించాలంటూ టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ తోనూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాలయ్యని ఇండస్ట్రీ పెద్దలు పక్కన పెడుతున్నారా అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఈ వివాదంపై తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర సీమలో బాలకృష్ణ ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామని.. బాలయ్యని నేను బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను.. గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానని కల్యాణ్ చెప్పారు. అంతేకాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాలయ్యతో పని జరుగుద్ది కాబట్టి అన్నిటికి ఆయన్ని ముందుడి తీసుకెళ్ళేవాళ్ళం. మాకు ఎవరితో పని జరిగుతుందో వాళ్లనే పిలుస్తాం.. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీలో గ్రూపులు లేవు.. బాలయ్య గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా..? ఇండస్ట్రీకి మేలు జరిగే విషయంలో ఎవరు ముందుకు వచ్చి వారి భుజాన వేసుకొని నడిపించినా వారి వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నిన్నటి దాకా దాసరి నారాయణ రావు గారు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. చిరంజీవి గారి ఫేస్ వాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం. అలాగే నాగార్జున గారు కూడా ముందుకు వచ్చారు'' అని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు సి. కళ్యాణ్ చేసిన ఫేస్ వాల్యూ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నాగార్జునకు ఉన్న ఫేస్ వాల్యూ మా బాలయ్యకి లేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 100కు పైగా సినిమాలలో నటించిన బాలకృష్ణ.. చిరంజీవి నాగార్జున లకు దేంట్లో తక్కువ అయ్యాడని.. వారికి ఉన్న ఫేస్ వాల్యూ మా హీరోకి ఎందుకు లేదు అని అడుగుతున్నారు. అంతేకాకుండా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాక్షేత్రంలో ఉన్న బాలయ్యకి లేని ఫేస్ వాల్యూ మిగతా వారికి ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.