నటసింహం బాలకృష్ణ తనకి గతంలో మంచి హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తో ఓ సినిమాని చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో బాలకృష్ణ-బి గోపాల్ కాంబినేషన్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయడు లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. చివరగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 'హర హర మహదేవ ' అనే సినిమాని మొదలుపెట్టినప్పటికీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ప్రస్తుతం బి గోపాల్ సినిమాలు అయితే చేయడం లేదు. చివరగా ఆయన గోపీచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్టు సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సీనియర్ డైరెక్టర్ బాలయ్య హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని బాలయ్య కూడా దీనికి ఓకె చెప్పాడని సమాచారం. ఇక ఇన్నాళ్ల తర్వాత వీరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం స్క్రిప్టు పని జోరుగా సాగుతోంది. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ స్క్రిప్టుకి మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. విషయం ఏమిటంటే, ఇందులో బాలకృష్ణ ఓ యువతికి తండ్రిగా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తారని - వైవిద్యభరితమైన రోల్‌లో బాలయ్యను చూపిస్తూ నందమూరి అభిమానులను ఉర్రూతలూగించాలనేది ఫైనల్ ప్లాన్ అన్నట్లు సమాచారం. అయితే బాలయ్య కూతురుగా ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని టాక్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. అది పూర్తయ్యాక బి గోపాల్ - బాలయ్యల సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.