కల్యాణ్ రామ్ తన కెరియర్లో ఫస్టు టైమ్ చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేస్తూ 'బింబిసార' సినిమా చేశాడు. తన బ్యానర్లో భారీ మొత్తం ఖర్చు చేసిన సినిమా ఇదే. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు - శిల్పకళావేదికలో జరిగింది. సినిమాటోగ్రఫీని అందించిన చోటా కె నాయుడు మాట్లాడుతూ .. "నేను చాలా ఫంక్షన్స్ కి వెళ్లాను .. స్టేజ్ లపైకి వెళ్లి మాట్లాడాను .. కానీ ఈ స్థాయి ఎనర్జీని మాత్రం ఇంతవరకూ చూడలేదు. మీ ఎనర్జీకి తగినట్టుగానే 'బింబిసార' ఉంటుంది.
ఇంతకుముందు చేసిన కల్యాణ్ రామ్ వేరు .. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ వేరు .. చింపిపడేశాడు. ఈ సినిమాతో మీకు పండగే .. ఆగస్టు 5వ తేదీన మీరంతా కూడా కల్యాణ్ రామ్ విశ్వరూపం చూస్తారు. ఈ సినిమాలో ఆయన చింపి చింపి తొక్కిపడేశాడు.
నేను ఇలా చెబుతుంటే ఆయన సిగ్గుపడుతున్నాడు .. అమ్మాయిలు పక్కన ఉన్నా సిగ్గే ఆయనకి. ఈ సినిమాలో మాంఛి హాటుగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది .. అప్పుడు కూడా షాట్ పెడితే ఆయన సిగ్గుతో పక్కకి వెళ్లిపోయేవాడు. కానీ నటన విషయానికి వస్తే చింపేశాడు.
తనకి సంతృప్తికరంగా అనిపించేవరకూ ఎన్ని టేకులైనా ఆయన చేస్తూనే ఉంటాడు. ఒక గుహలో పడిపోయే సీన్ కోసం ఆయన 25 టేక్స్ తీసుకున్నాడు .. అన్నిసార్లు ఆయన పై నుంచి పడ్డాడు. ఇక మా డైరెక్టర్ అందరినీ ఒకేసారి అమ్మేయగలడు .. అంతముదురు. ఒక చేత్తో కల్యాణ్ రామ్ ను .. మరో చేత్తో హరిని .. ఇద్దరినీ గుప్పెట్లో పెట్టుకుని ఈ సినిమాను చేశాడు. కొత్తగా వచ్చిన చాలామంది దర్శకులను నేను చూశాను .. వాళ్ల బిహేవియర్ .. యాటిట్యూడ్ మారిపోతుంది. కానీ వశిష్ఠ అన్నీ తానై చేశాడు. ఒక కొత్త దర్శకుడు ఎలా ఉండాలనేది ఆయనను చూసి నేర్చుకోవాలి.
ఇక హీరోయిన్స్ పాత్రలు సస్పెన్స్ తో ఉంచాలి గనుక వాళ్లను గురించి మీరు సినిమా చూసి తెలుసుకోవలసిందే. ఈ సినిమాతో ఫైట్ మాస్టర్ గా రామకృష్ణ కొత్తగా పరిచయమవుతున్నాడు .. అద్భుతంగా చేశాడు. ఇక హరి విషయానికి వస్తే .. ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనపడేలా చూసుకుంటాడు. ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. ఎక్కడ ఏదీ పక్కన పెట్టేసే అవసరం లేకుండా చూసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అంటూ ముగించాడు.