నందమూరి వారి దీపావళి శుభాకాంక్షలు.. అవి చాలా ప్రత్యేకమంతే!

Update: 2020-11-14 14:01 GMT
నటసింహం బాలయ్యబాబు తన అభిమానులకు ప్రతి పండుగకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతుంటాడు. తెలుగు భాష, సంస్కృతి అంటే ఎంతో అభిమానించే బాలకృష్ణ తన అభిమానులకు ఎప్పుడూ కొత్తవిషయాలను చెబుతుంటాడు. సోషల్​మీడియాలో అంత యాక్టివ్​గా ఉండని బాలయ్య. పండుగలు, ప్రత్యేక సందర్బాల్లో మాత్రమే పోస్టులు పెడుతుంటారు. తాజాగా దీపావళి సందర్భంగా ఎంతో ఆసక్తికరమైన, సమాచారవంతమైన పోస్టు పెట్టారు. దీపావళి పండగ.. అసలు దీపం అంటే ఏమిటో దాన్ని సంబంధించిన విశిష్ఠత ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు.


దీపావళి విశిష్ఠత తెలిసేలా ఓ శ్లోకాన్ని పోస్ట్ చేశాడు.
శ్లోకం: దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం సర్వతమోపహమ్, ! దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే... !!
అర్థం: దీపం పరబ్రహ్మ సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనం, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సకలాభీష్ట పరమార్థాలనూ సిద్ధింపజేసే పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య పరంజ్యోతికి ప్రణామం.’ అంటూ దాన్ని అర్థాన్ని పోస్ట్​ చేశాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే ఈ దీపావళి పండుగ మీకు అన్ని రకాలుగానూ.. అన్ని రంగాల్లోనూ విజయం చేకూరాలని కోరుతూ.. మీ నందమూరి బాలకృష్ణ’ అంటూ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశాడు.

బాలయ్యా! మీ శ్లోకం నుంచి ఎంతో నేర్చుకున్నామంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.

ఎన్టీఆర్ ఇలా..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరికీ కౌంటర్లు వేసే ఎన్టీఆర్ ప్రత్యేక సందర్భాల్లో ఆసక్తికరమైన పోస్ట్ లు చేయడంలో ముందుంటాడు. పండుగలకు అందరికంటే ముందుగానే ప్రజలకు, అభిమానులకు శుభాకాంక్షలు చెబుతాడు. అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు. ఈ సారి దీపావళి సందర్భంగా' మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
Tags:    

Similar News