బాలయ్యకే అభిమానులమంటూ ఫ్లెక్సీలు

Update: 2015-10-29 12:37 GMT
నందమూరి హీరోల మధ్యే కాదు.. అభిమానుల మధ్య కూడా కొంత అంతరం ఉందన్న మాట వాస్తవం. ఎన్టీఆర్ సినిమాలు విడుదల సమయంలో ఉద్దేశ్యపూర్వకంగా బాయ్ కాట్ చేయించారనే వార్తలు కూడా వినిపిస్తాయి. ఇలాంటి వివాదాలను పక్కకు నెట్టాలని, నందమూరీ హీరోలంతా ఒకటే అని చాటి చెప్పాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తుంటాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఆడియోను కూడా యంగ్ టైగర్ చేతుల మీదుగా లాంఛ్ చేయించాడు.

ఆ ఫంక్షన్ లోనూ అన్నయ్య అంటే ఉన్న అభిమానాన్ని చాటేలా మాట్లాడాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ మధ్య అభిప్రాయ బేధాలు వద్దంటూ ఆవేశంగానే చెప్పాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించాడు. అయితే.. కళ్యాణ్ రామ్ చెప్పినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. తాజాగా పలు జిల్లాల్లో షేర్ మూవీ విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్లీ వెలిశాయి. వీటిలో బాలయ్య అభిమానులం.. బాలయ్యకే అభిమానులం అంటూ ప్రముఖంగా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు.

ఎక్కడా ఎన్టీఆర్ పేరు కానీ, ఫోటో కానీ లేకుండా జాగ్రత్తపడ్డారు ఫ్యాన్స్. ఇది ఎన్టీఆర్ ను పక్కకు నెట్టడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే కళ్యాణ్‌ రామ్‌ ఎంత చెప్పినా అభిమానులు మారలేదు. ఎన్టీఆర్‌ ను సైడ్‌ చేసేశారని అర్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఈవిషయంలో కాస్త ఆలోచిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ వివాదాల కారణంగా.. రికార్డులు సృష్టించే అవకాశం నందమూరి హీరోలకు దూరమవుతోందన్నది సుస్పష్టం.
Tags:    

Similar News