అభిమానుల‌కు హ‌రికృష్ణ చివ‌రి లేఖ ఇదే!

Update: 2018-08-29 07:15 GMT
నంద‌మూరి కుటుంబంలో షాకింగ్ విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉద‌యం నెల్లూరు జిల్లా కావ‌లిలో జ‌రిగే వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు కారులో బ‌య‌లుదేరిన హ‌రికృష్ణ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం తెలిసిందే. స్వ‌యంగా తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటి ద‌గ్గ‌ర నుంచి ఉత్సాహంగా బ‌య‌లుదేరిన ఆయ‌న వాహ‌నం.. అన్నేవ‌ర్తి ద‌గ్గ‌ర డివైడ‌ర్ ను బ‌లంగా ఢీ కొట్టింది.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారు వేగం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. డివైడ‌ర్ ను కారు ఢీ కొట్టి ప‌ల్టీలు కొట్టి రోడ్డు ప‌క్క‌కు ప‌డిపోయింద‌ని.. దీంతో కారులో నుంచి హ‌రికృష్ణ బ‌య‌ట‌కు ప‌డిపోయారు. దీంతో.. ఆయ‌న త‌ల‌కు.. శ‌రీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌మాదం చోటు చేసుకున్న ఘ‌ట‌నాస్థ‌లంలోనే హ‌రికృష్ణ అప‌స్మార‌క స్థితిలోకి జారిపోయిన‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హ‌రికృష్ణ పుట్టిన‌రోజు సెప్టెంబ‌రు 2. మ‌రో నాలుగు రోజుల్లో వ‌చ్చే త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ముంద‌స్తుగా ఆయ‌న ఒక లేఖ‌ను సిద్ధం చేసుకున్నారు.

తాజాగా.. ఆ లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెప్టెంబ‌రు 2న త‌న 62వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న మిత్రులు.. అభిమానులు.. శ్రేయోభిలాషులు ఎవ‌రూ హ‌డావుడి చేయొద్ద‌ని.. వేడుక‌లు జ‌ర‌పొద్ద‌న్న మాట లేఖ‌లో ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనూ.. కేర‌ళ రాష్ట్రంలో చోటు చేసుకున్న వ‌ర‌ద‌లు.. వ‌ర్షాల నేప‌థ్యంలో ఎంతో మంది ప్రాణాలు విడిచార‌ని.. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని.. అలాంటి వారి విషాద‌వేళ వేడుక‌లు జ‌రుపుకోవ‌టం స‌రికాద‌న్నారు. అందుకే.. త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని బ్యాన‌ర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్ద‌ని.. పుష్ప‌గుచ్చాలు.. దండ‌లు తీసుకురావ‌ద్దంటూ ఒక లేఖ‌ను త‌న స్వ‌ద‌స్తూరితో రాశారు. ఆ లేఖ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News