'నందిని నర్సింగ్ హోం' రివ్యూ
నటీనటులు: నవీన్ విజయ్ కృష్ణ-నిత్య-శ్రావ్య-జయప్రకాష్-జయప్రకాష్ రెడ్డి-సంజయ్ స్వరూప్-వెన్నెల కిషోర్-షకలక శంకర్-సప్తగిరి తదితరులు
సంగీతం: అచ్చు
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: రాధాకిషోర్-బిక్షమయ్య
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.వి.గిరి
తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ‘నందిని నర్సింగ్ హోం’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. దీని దర్శకుడు.. నిర్మాతలు కూడా కొత్త వాళ్లే. వీళ్లంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో.. నవీన్ అరంగేట్రంలో ఎలాంటి ముద్ర వేశాడో చూద్దాం పదండి.
కథ: చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ్ కృష్ణ) ఎంకామ్ చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఎంబీబీఎస్ చదివానని చెప్పుకుని నందిని నర్సింగ్ హోం అనే హాస్పిటల్లో వైద్యుడిగా చేరతాడు. అక్కడ కాంపౌండర్ గా పని చేసే స్నేహితుడి సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తుంటాడు. ఆ హాస్పిటల్ యజమాని అయిన నందిని (నిత్య) అతణ్ని ఇష్టపడుతుంది. ఐతే గతంలో అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయితో ప్రేమలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నందినికి కొంచెం దూరంగా ఉంటాడు చందు. ఇదిలా ఉంటే చందు చేసిన తప్పిదం కారణంగా ఒక ప్రాణమే పోతుంది. దీనికి తోడు నందిని నర్సింగ్ హోంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఇంతకీ చందు ఏం తప్పు చేశాడు.. హాస్పిటల్లో తెర వెనుక ఏం జరుగుతుంటుంది.. అమూల్యతో అతడి గతమేంటి.. నిత్యతో చందు వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లింది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే అతణ్ని మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి మసాలాలన్నీ వేసి కథలు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా హీరో బిల్డప్పులు.. ఇంట్రడక్షన్ సాంగ్.. డ్యాన్సింగ్ టాలెంట్ చూపించే పాటలు.. భారీ ఫైట్లు.. ఇలాంటి తతంగం చాలా ఉంటుంది. నవీన్ అరంగేట్ర సినిమా విషయంలో ఇలాంటివేమీ లేకుండా ఒక సింపుల్ కథను సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించినందుకు.. నవీన్ ను కేవలం ఒక ‘నటుడి’గా పరిచయం చేయాలని చూసినందుకు ముందు ‘నందిని నర్సింగ్ హోం’ టీంను అభినందించాలి.
‘నందిని నర్సింగ్ హోం’ ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా సింపుల్ గా సాగిపోయే ఒక ఎంటర్టైనర్. లాజిక్ గురించి పెద్దగా పట్టించుకోకుండా.. ప్రేక్షకుడి బుర్రకు మరీ పరీక్షలేమీ పెట్టకుండా టైంపాస్ చేయిస్తూ సాగిపోయే కథ ఇది. కథ మరీ గొప్పగా ఏమీ ఉండదు. కథనంలో అంత బిగి కూడా కనిపించదు. కానీ చాలా వరకు బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించేయడంలో మాత్రం ఈ సినిమా విజయవంతమైంది. ఈ విషయంలో కామెడీ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో హార్రర్.. సస్పెన్స్ ఉన్నప్పటికీ.. వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ప్రధానంగా కథనాన్ని కామెడీతో నడిపించే ప్రయత్నమే చేశాడు కొత్త దర్శకుడు పి.వి.గిరి. కొన్ని చోట్ల అవసరానికి మించి కామెడీ మీద ఆధారపడటం వల్ల కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా.. సినిమాకు మాత్రం ప్రధాన ఆకర్షణ ఆ కామెడీనే.
ఓవైపు పోలీసులకు భయపడి కోమాలో ఉన్నవాడిగా నటిస్తూ హాస్పిటల్లో చేరే దొంగగా వెన్నెల కిషోర్.. మరోవైపు హాస్పిటల్లో గది తీసుకుని అక్కడే ‘బిజినెస్’ నడిపించే జగత్ కంత్రీగా సప్తగిరి.. ఇంకోవైపు కన్నింగ్ కాంపౌండర్ గా సప్తగిరి.. ఈ ముగ్గురినీ దర్శకుడు సరిగ్గా వాడుకుని కామెడీ బండిని లాగించేశాడు. హీరో నవీన్ కూడా వాళ్లలో ఒకడిగా మారిపోయి కామెడీ పండించడానికి సిన్సియర్ ఎఫర్టే పెట్టాడు. దీంతో సినిమాలో రెండు అర్ధాల్లోనూ కామెడీకి ఢోకా లేకపోయింది. ముఖ్యంగా నవీన్-సప్తగిరి-వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా సాగుతాయి.
హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో అంత విశేషం ఏమీ లేదు కానీ.. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. అది అబ్ రప్ట్ గా ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. దానికి చివర్లో జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఐతే వర్తమానంలోకి వచ్చేసరికి కామెడీలో పడి దర్శకుడు అసలు కథను సరిగా నడిపించలేకపోయాడు. ఇంటర్వెల్ దగ్గర సీరియస్ టర్న్ తీసుకునే కథను ఆ తర్వాత బిగితో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంత సీరియస్ విషయం జరిగాక దాని తాలూకు టెంపోను ఆ తర్వాత కొనసాగించలేదు. హీరో చేసిన తప్పు వల్ల ఒక డాక్టర్ అనూహ్యంగా చనిపోతే అతడికేమైందన్నది పోస్టుమార్టం రిపోర్టులో తెలియకుండా ఉంటుందా?
ఐతే ఎంబీబీఎస్ చదవని కుర్రాడు హాస్పిటల్లో డాక్టర్ గా కంటిన్యూ అయిపోవడం అన్నదాంట్లోనే లాజిక్ లేదు కాబట్టి.. మిగతా విషయాలు ఎలా ఉన్నా పర్వాలేదు.. లైట్ అన్నట్లుగా దర్శకుడు కథను నడిపించేశాడు. కథనం పరంగా ప్రథమార్ధంలో కనిపించిన వేగం ద్వితీయార్ధంలో ఉండదు. కథ పాకాన పడాల్సిన టైంలోనూ దర్శకుడు కామెడీనే నమ్ముకున్నాడు. పైగా లెంగ్త్ కూడా ఎక్కువైపోవడంతో ద్వితీయార్ధం గాడి తప్పింది. హీరోకు నిజం తెలిశాక చకచకా సినిమాను ముగించకుండా సాగదీశారు. ప్రి క్లైమాక్సులో వచ్చే పాట అనవసరం. క్లైమాక్స్ ట్విస్టు థ్రిల్లింగ్ గానే ఉంది కానీ.. దాన్ని ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. నిజానికి ఈ కథకు అలాంటి ముగింపు ఉంటుందని ఊహించలేం. ఓవరాల్ గా చూస్తే ‘నందిని నర్సింగ్’ లోపాలున్నప్పటికీ వాటిని కప్పిపుచ్చే వినోదం టైంపాస్ చేయించేస్తుంది.
నటీనటులు: ‘నందిని నర్సింగ్ హోం’ సినిమాలాగే నవీన్ కూడా సింపుల్ గా ఉన్నాడు. కథాకథనాల పరంగానే కాక నవీన్ నటన పరంగా చూసినా ఇది అతడి తొలి సినిమా లాగా అనిపించదు. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నవాడిలా ఈజ్ చూపించాడు. పాత్రలో సులభంగా ఒదిగిపోయాడు. కొన్ని సన్నివేశాల్లోనే అతడికి.. అతడి నటనకు అలవాటు పడిపోతాం. ఇంట్రడక్షన్లో కానీ.. సినిమాలో మరెక్కడా కానీ.. కొత్త హీరోకిచ్చే బిల్డప్పుల కోసం ప్రయత్నించకపోవడంలోనే అతను ఆకట్టుకుంటాడు. లుక్స్ ఏవరేజే కానీ.. నవీన్ నటన మాత్రం మెప్పిస్తుంది. హీరోయిన్లు సినిమాకు ఆకర్షణ కాలేకపోయారు. హీరోను డామినేట్ చేయకూడదనుకున్నారో ఏమో.. గ్లామర్ విషయంలో ఇద్దరూ వీక్ హీరోయిన్లనే పెట్టారు. శ్రావ్య.. నిత్య లుక్స్ పరంగా పూర్. నటన పర్వాలేదు. వెన్నెల కిషోర్.. సప్తగిరి.. షకలక శంకర్ ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ల కామెడీ టైమింగ్ కు తగ్గట్లుగా పాత్రల్ని తీర్చిదిద్దడంతో బాగా నవ్వించారు. జయప్రకాష్.. జయప్రకాష్ రెడ్డి పాత్రలకు తగ్గట్లుగా నటించారు.
సాంకేతికవర్గం: అచ్చు సంగీతం ఓకే. నిన్నే చూస్తున్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్లో వాడుకున్ థీమ్ మ్యూజిక్ బాగున్నాయి. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతంలో కొన్నిచోట్ల అనవసర హంగామా ఎక్కువైంది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఏవేరేజ్. కథ ఇక్కడే సాగుతోంది అని చెప్పడానికి పదే పదే నర్సింగ్ హోం లాంగ్ షాట్ చూపించడం లాంటివి అనవసరం అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమంత గొప్పగా లేవ. తక్కువ ఖర్చులో.. పరిమితమైన లొకేషన్లలో సినిమాను ముగించేశారు. పి.వి.గిరి దర్శకుడిగా ప్రత్యేకమైన ముద్ర వేయలేదు కానీ.. సినిమాను బాగానే డీల్ చేశాడు. ముఖ్యంగా కామెడీ విషయంలో అతడికి పట్టుందన్న సంగతి చాలా సన్నివేశాల్లో తెలుస్తుంది. కామెడీ సీన్స్ చూస్తే దర్శకుడు కొత్త వాడన్న అభిప్రాయమే కలగదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. కథనంలో బిగి లేదు. ఐతే ఒక కొత్త హీరోను పెట్టుకుని ఈ కథతో టైంపాస్ చేయించినందకు అతను అభినందించవచ్చు.
చివరగా: నందిని నర్సింగ్ హోం.. టైంపాస్ చేయిస్తుంది
రేటింగ్- 2.75/5