భర్త ఆత్మహత్యపై టీవీ నటి షాకింగ్ కామెంట్స్

Update: 2017-04-05 09:12 GMT
తమిళంలో ఒకటీ అరా సినిమాలతో పాటు చాలా సీరియళ్లలో నటించిన నందిని భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో అందరూ నందినినే వేలెల్తి చూపడం మొదలుపెట్టారు. ఆమే కార్తికేయన్ ఆత్మహత్యకు ప్రధాన కారకురాలని నిందించారు. ఐతే ఈ ఆరోపణల్ని నందిని తిప్పికొట్టింది. భర్త వల్ల తాను పడ్డ ఇబ్బందులన్నీ మనసులోనే దాచుకున్నానని.. కానీ ఇప్పుడు తాను నోరు విప్పక తప్పడం లేదంటూ.. తన భర్త గురించి షాకింగ్ కామెంట్లు చేసింది నందిని.

తన భర్త పెద్ద మోసగాడని నందిని అంది. అతను ఎంతోమంది దగ్గర డబ్బులు తీసుకుని.. వారికి తిరిగివ్వకుండా ఇబ్బంది పెట్టారని.. వాళ్లందరూ తనను వేధించారని ఆమె తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని కార్తికేయన్ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని.. వాళ్లందరూ తనను నిలదీస్తే తాను భర్తను నిలదీశానని.. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ అతను బెదిరించాడని.. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు తనను పుట్టింటికి తీసుకెళ్లిపోయారని నందిని తెలిపింది. తాను చాన్నాళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్నానని.. అతడి ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది.

తన భర్తకు గతంలో ఓ యువతితో వివాహేతర సంబంధం ఉండేదని.. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఆ కేసులో అతడిని పోలీసులు అరెస్టు కూడా చేశారని నందిని వెల్లడించింది. కార్తికేయన్ తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్న సంగతి.. వివాహం తర్వాతే తెలిసిందని.. అతడి ఆత్మహత్యతో తన పరువు మొత్తం బజారున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News