బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లలో ఎవరికి శత్రువు కాకుండా నొప్పించనట్లుగా వ్యవహరిస్తూ.. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లకుండా తెలివిగా గేమ్ ఆడే వారిలో రోల్ రైడా ఒకరు. సేఫ్ గేమ్ ఆడే వారిలో అమిత్ ముందుంటే.. ఆ తర్వాతి స్థానం రోల్ రైడాది. తనను తాను సేవ్ చేసుకుంటూ.. ఎవరి చేతా కార్నర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం అతగాడిలో కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి రైల్ రోడా మీద బిగ్ బాంబ్ వేసింది నందిని. ఎలిమినేట్ అయిన వారు హౌస్ నుంచి వెళ్లే క్రమంలో బిగ్ బాంబ్ వేయటం తెలిసిందే. ఈసారి బిగ్ బాంబ్ ను రోడ్ రైడా మీద వేసింది. గార్డెన్ ఏరియాలో రాబోయే వారం పాటు ఒక మసాజ్ పార్లర్ ఉంటుందని.. హౌస్ మేట్స్ అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ.. ఇంట్లో ఉండే వారి సమస్యల గురించి మాట్లాడాలన్నదే ఈసారి బిగ్ బాంబ్ గా తేల్చారు.
సమస్యల గురించి మాట్లాడటం అంటే వివాదాల తేనెతుట్టెను కదపటమే. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండే రోల్ రైడాకు.. అదే ఇష్యూ మీద మాట్లాడటం అంటే పెద్ద చిక్కే. సో.. ఈ వారం రోల్ రైడాకు బిగ్ బాంగ్ పేరుతో విషమ పరీక్ష ఎదురైందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. ఎలిమినేట్ అయిన సందర్భంగా నందినికి హౌస్ లో ఉన్న ఇద్దరితో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా గీతా మాధురి.. దీప్తిలతో నందిని మాట్లాడింది. తాజా పరిణామాలతో బిగ్ బాస్ హౌస్ లో మార్పులు చోటు చేసుకోవటమే కాదు.. హౌస్ ను మరింత వేడెక్కెలా చేసిందని చెప్పక తప్పదు.