బోల్డ్‌ వేశ్య పాత్రలో బిగ్‌ బాస్‌ క్యూటీ

Update: 2020-08-11 02:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ లో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నందిని రాయ్‌. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసినా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్‌ బాస్‌ వల్ల మంచి ఆఫర్లు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈమె తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అందులో ఈమె పాత్ర బోల్డ్‌ గా ఉంటుందని అన్నారు. బోల్డ్‌ పాత్రలు స్కిన్‌ షో కు ఎలాంటి అభ్యంతరం చెప్పని నందిని రాయ్‌ మరో సాహస పాత్రలో నటించింది.

మెట్రో కథలు అనే చిత్రంలో నందిని రాయ్‌ కీలక పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఈమె పాత్ర వేశ్యగా టీజర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. విభిన్నమైన పాత్రలు చేయడం ద్వారా గుర్తింపు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో నందిని ఈ పాత్రకు ఓకే చెప్పి ఉంటుందని అంటున్నారు. టీజర్‌ లోనే ఆమె నటన ప్రతిభ కనిపిస్తుందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఇలాంటి పాత్రల్లో నటించేందుకు పరిణితి చాలా అవసరం. వేదం చిత్రంలో అనుష్క చేసిన అటువంటి పాత్ర ఇది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రను నందిని రాయ్‌ చక్కగా చేసిందంటున్నారు. ఆహాలో ఈ సినిమాను ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పలాస వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ దర్శకుడు ఈసారి వెబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక్క నగరం నాలుగు విభిన్నమైన కథలు అంటూ ఈ సినిమాకు ట్యాగ్‌ పెట్టారు. ఈ సినిమాతో నందిని రాయ్‌ క్రేజ్‌ పెరిగేనా చూడాలి.
Tags:    

Similar News