తెలుగ‌మ్మాయి హాట్ నెస్ ఓవ‌ర్ లోడెడ్..!

Update: 2020-09-30 03:30 GMT
నందిని రాయ్.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ అన‌గానే ఠ‌కీమ‌ని గుర్తొస్తుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల వెండితెర స‌హా ఓటీటీ వేదిక‌ల‌పైనా పాపులారిటీ పెంచుకునే ప‌నిలో ఉంది. ఆహాలో `మెట్రో క‌థ‌లు` త‌నుక మంచి మైలేజ్ ని ఇస్తుంద‌నే న‌మ్ముతోంది. ఈ సినిమాలో బ్రెస్ట్ క్యాన్స‌ర్ పేషెంట్ గా న‌టించిన నందిని చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఇక నందినిలో గ్లామ‌ర‌స్ యాంగిల్ గురించి ప్ర‌త్యేకించి మాట్లాడుకోవాల్సిందే. మ‌రోవైపు టైమ్ క‌లిసొచ్చిన‌ప్పుడే క‌ర్చీఫ్ వేయాల‌న్న ప్ర‌య‌త్నం ఈ అమ్మ‌డు వ‌ద‌ల‌డం లేదు. ఇన్ స్టా మాధ్య‌మంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో అంత‌కంత‌కు అగ్గి రాజేస్తోంది. ఇదివ‌ర‌కూ

తాజాగా వేడెక్కించే ఫోటో షూట్ ని నందిని రాయ్ షేర్ చేసింది. ఇందులో ఓకింత క‌ళాత్మ‌కంగా క‌నిపిస్తూనే.. మ‌రింత హీట్ పెంచే కోణాన్ని ప్రెజెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. బ్లాక్ టూపీస్ డ్రెస్ లో థై సొగ‌సుల ఎలివేష‌న్ చేస్తోంది. `యువ‌ర్ జెనెటిక్స్ లోడ్ ది గ‌న్.. యువ‌ర్ లైఫ్ స్టైల్ పుల్స్ ది ట్రిగ్గ‌ర్` అంటూ వేడెక్కించే కామెంట్ నే ఎటాచ్ చేసింది ఈ ఫోటోకి. మొత్తానికి త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్ ని ఏమాత్రం దాచుకోవ‌డం లేదు. ఆ ర‌కంగా మేక‌ర్స్ కి ఫీల‌ర్స్ వ‌దులుతోంది. నందిని రాయ్ ఇటీవ‌ల ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాలు వెంట‌ప‌డుతున్నాయ‌ట‌. కానీ తెలుగు చిత్రాల‌కు సంత‌కాలు చేయాల‌నేది ప్లాన్.
Tags:    

Similar News