'నేనూ సూసైడ్ చేసుకోవాలనుకున్నా'.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-06-24 23:30 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. సుశాంత్ కంటే ముందు చాలా మంది సెల‌బ్రెటీలు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి సిచ్యుయేషన్ నుండి బయటపడిన వారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము డిప్రెషన్‌ కి గురైన విషయాల్ని.. అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో బహిరంగంగా వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్, బిగ్‌ బాస్‌ బ్యూటీ నందినీ రాయ్‌ కూడా డిప్రెషన్ కి గురై పలుమార్లు సూసైడ్‌ చేసుకోవాలనుకున్ననని వెల్లడించారు.

నందినీ రాయ్‌ తెలుగులో 'హార్మోన్స్' 'మాయ' 'మోసగాళ్ళకు మోసగాడు' 'సిల్లీ ఫెలోస్' వంటి అడపాదడపా చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే 'బిగ్ బాస్' రెండవ సీజన్ లో అడుగుపెట్టి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా నందినీ రాయ్‌ మాట్లాడుతూ.. ''2011లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అంత‌గా ఆడ‌క‌పోవ‌డం వల్ల పూర్తిగా నిరాశ చెందాను. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. ఇండస్ట్రీలో విజయాలతో పాటు పాపులారిటీ, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అది క్రమంగా మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌ కు దారి తీస్తుంది'' అని చెప్పుకొచ్చింది.

ఇంకా నందిని మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఇంటి టెర్రస్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. దాదాపు రెండేళ్ల పాటు మానసిక వేదన అనుభవించాను. అయితే బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పాల్గొని వచ్చిన తర్వాత నన్ను నేను స్ట్రాంగ్ గా మార్చుకున్నాను. డిప్రెషన్‌ లో ఉన్నప్పుడు నలుగురితో కలవడానికి ఇష్డపడరు. ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. నేను డిప్రెషన్‌ ను తగ్గించుకునేందుకు స్నేహితులతో మాట్లాడేదానినని.. డాక్టర్స్ వ‌ద్ద‌ కౌన్స్లింగ్ తీసుకున్నానని.. యోగా వ్యాయామాలు చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News