ఆత్మ ఆవ‌హించిన స్పైడ‌ర్ ఉమెన్‌

Update: 2018-10-24 15:30 GMT
ఉన్న‌ట్టుండి స్పైడ‌ర్(సాలీడు) ల‌క్ష‌ణాలు ఒళ్లంతా పాకేస్తూ.. ఆ త‌ర్వాత సాలెగూడులో చిక్కుకుపోయి గిజ‌గిజ గింజుకుంటే.. ఉన్న‌ట్టుండి అతీత శ‌క్తులు ఆవ‌హించి గాల్లోకి లేస్తే.. ఆకాశ‌హార్మ్యాల్లోకి - భారీ ఫ్లై ఓవ‌ర్‌ మీది నుంచి స‌ముద్రంలోకి ఎగిరే శ‌క్తులు శ‌రీరంలోకి ప్ర‌వ‌హిస్తే... అలాంటి స్పైడ‌ర్ ఉమెన్ క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్ష‌మైతే.. ఆహా! ఆ ఊహే అద్భుతం క‌దూ?  అస‌లు హాలీవుడ్‌ లో క్యాట్ ఉమెన్ - సూప‌ర్ ఉమెన్ అంటూ కామిక్ క్యారెక్ట‌ర్ల‌తో సినిమాలు తీస్తున్నారు కానీ, అదే మ‌న నందిత శ్వేత‌తో అలాంటి ప్ర‌య‌త్నం  ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు.  దేశంలోకి ఆత్మ ఆవ‌హిస్తేనే ధ‌డ‌ధ‌డ లాడించింది. ఎక్కిడికి పోతావు చిన్న‌వాడా? అంటూ వెంటాడింది. దెయ్యం  ప‌ట్టిన ప్రేతాత్మ‌గా భీక‌రంగా న‌టించి మ‌తి చెడ‌గొట్టింది నందిత శ్వేత‌. తాటికాయ క‌ళ్ల‌తో ఉరుములు ఉరిమి తాట తీసింది. ఇక స్పైడ‌ర్ ఉమెన్ వేషం క‌ట్టిన శ్వేత‌ను ఆత్మ ఆవ‌హిస్తే త‌స్సాదియ్య భ‌ర‌తం ప‌ట్టేయ‌దూ?.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?  చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన ఈ చిన్న‌ది ఆత్మ ఆవ‌హించిన ప్రేమికురాలి పాత్ర‌లో అద్భుతంగా అభిన‌యించి కుర్ర‌కారు మ‌న‌సు దోచింది. సినిమా ఆద్యంతం  నందిత షో క‌ట్టిప‌డేసింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. గొప్ప న‌టి అన్న కితాబు అందుకుంది. ఇటీవ‌లే శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంలోనూ నందిత త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది.  న‌టిగా అవార్డులెన్నో అందుకుని దూసుకుపోతున్న స్పెష‌ల్ ట్యాలెంటు నందిత శ్వేత‌. క‌న్న‌డ నుంచి త‌మిళంలోకి, అట్నుంచి తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించి క‌ర్ఛీఫ్ వేసేసింది.

ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ప్రేమ‌క‌థా చిత్రమ్‌` సీక్వెల్ లో న‌టించేందుకు రెడీ అవుతోంది. అలానే త‌మిళంలోనూ కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉంది.  ప్ర‌భుదేవా - త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఏ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం  వ‌హిస్తున్న దేవి 2 చిత్రంలోనూ నందిత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్‌.జె.సూర్య‌- సెల్వ‌రాఘ‌వ‌న్‌- గౌత‌మ్ మీన‌న్ క్రేజీ కాంబినేషన్‌ లోని హార‌ర్ మూవీ నేంజ‌మ్ మ‌ర‌ప్ప‌తిలై అనే చిత్రంలోనూ నందిత క‌థానాయిక‌.  శివాజీ గ‌ణేష‌న్‌- సావిత్రి జంట‌గా న‌టించిన క్లాసిక్ మూవీ వ‌నంగ‌మూడి చిత్రం రీమేక్‌లోనూ నందిత క‌థానాయిక‌గా న‌టించ‌నుందని తెలుస్తోంది. తాజాగా స్పైడ‌ర్ ఉమెన్ లుక్‌ లో ఫోటో షూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతోంది. నందిత స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లోనూ ఈ ఫోటోల్ని అభిమానుల‌కు షేర్ చేశారు.
Tags:    

Similar News