బిగ్ బాస్ -2 ముగింపునకు వస్తోన్న కొద్దీ ఘాటుగా మసాలా దట్టించాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్....హౌస్ మేట్స్ కు అడ్డమైన టాస్క్ లు ఇస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు జరిగిన `సీక్రెట్ టాస్క్` లో భాగంగా సింగర్ గీతామాధురి నుదుటిపై ....రోల్ రైడా ముద్దుపెట్టుకోవడం - టాస్క్ కు ఏమాత్రం సంబంధం లేని సామ్రాట్ కూడా గీతామాధురి బుగ్గపై ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఆ టాస్క్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పెళ్లైనా గీతా మాధురికి ముద్దుల టాస్క్ ఇవ్వడం, సామ్రాట్ ముద్దు పెట్టడంపై గీతా మాధురి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై కూడా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను బిగ్ బాస్ మంటకలుపుతున్నాడంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో మరో పుకారు షికారు చేస్తోంది. గీతా మాధురి ముద్దుల టాస్క్ పై ఆమె భర్త నందు గుర్రుగా ఉన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తున్నాయి. సీక్రెట్ టాస్క్ లో భాగంగా తన భార్యకు ముద్దు పెట్టిన రోల్ రైడా సంగతి పక్కనబెడితే....టాస్క్ కు ఏమాత్రం సంబంధం లేని సామ్రాట్...ముద్దు పెట్టినందుకు నందు అప్సెట్ అయ్యాడని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు, ఫైనల్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే షోకు మరింత హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ లు ఇస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. టీఆర్పీల కోసం బిగ్ బాస్ ఇంత దిగజారడం పై విమర్శలు గుప్పిస్తున్నారు.