ఊహించినట్టె నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్న గ్యాంగ్ లీడర్ టైటిల్ నే నాని 24కి ఫిక్స్ చేసారు. ఈ మేరకు మైత్రి సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా చిన్న వీడియో బిట్ ని విడుదల చేసి ఖరారు చేసింది. అందులో ఓ పోలీస్ ఆఫీసర్ ఎదురుగా సత్య కూర్చుని ఉంటాడు. ఎంత మంది అని అతను అడిగిన ప్రశ్నకు సత్య సమాధానం ఇస్తూ 8-17-22-50-80 ఇలా మనిషి జీవితంలోని కీలకమైన వయసుల్లో ఉన్న ఐదుగురు అమ్మాయిలు మహిళలు ఉన్నారని చెబుతాడు. వాళ్ళ వెనుక ఓ లీడర్ ఉన్నాడని అతనే నాని అని చెప్పడంతో సన్నివేశం ముగుస్తుంది.
నాని లుక్ ని రివీల్ చేయకుండా కేవలం సత్య పాత్ర ద్వారానే లైన్ ని చెప్పీ చెప్పకుండా రివీల్ చేసారు. ఓ చిన్న పాప-చెల్లిగా భావించే టీనేజర్-అమ్మలా ఫీలయ్యే ఓ తల్లి-కిరాక్ పుట్టించే ఓ అందమైన అమ్మాయి-వయసు మళ్ళిన ఓ ముసలి బామ్మ ఇలా మొత్తం ఐదుగురు నాని గ్యాంగ్ లో ఉంటారు. అసలు అబ్బాయిలతో ఉండాల్సిన హీరో గ్యాంగ్ లో ఇందరు లేడీస్ ఎందుకు ఉన్నారు వాళ్ళను నాని ఏం చేసాడు అనేది సస్పెన్స్
విక్రం కుమార్ మొదటి సారి మాస్ టైటిల్ ని ఎంచుకున్నాడు. . గ్యాంగ్ లీడర్ ఒకప్పటి మెగాస్టార్ ఆల్ టైం బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ మెగా ఫ్యాన్స్ కు ఓ ఎమోషనల్ కనెక్షన్. ఏరికోరి మరీ ఈ టైటిల్ ను ఎంచుకున్నారు అంటే ఏదో గట్టి విషయమే ఉన్నట్టుంది. ఒక్క సీన్ తప్ప వీడియోలో ఇంకేమి లేదు. లైన్ ఏదో క్లాస్ గా ఉంది టైటిల్ చూస్తే మాస్ గా ఉంది. కారణం తెలియాలంటే విడుదలయ్యే ఆగస్ట్ నెల దాకా వెయిట్ చేయాలి. అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న తెలుగు సినిమా ఇదే.
Full View