టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పై నటి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నాని బండారం బయటపెడతానని - అంతా అనుకుంటున్నట్లు నాని అంత మంచి వాడేమీ కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది. నాని+శ్రీరెడ్డి=డర్టీ పిక్చర్ అని....తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా, నాని ఒత్తిడి వల్లే తనకు బిగ్ బాస్ -2 షోలో అవకాశం దక్కలేదని తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో తన ఫ్లాట్ కు వచ్చేవాడని - తనకు సినిమా అవకాశాలిస్తానని నాని తనను మోసం చేశాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలను బిగ్ బాస్ నిర్వాహకులు - స్టార్ మా యాజమాన్యం - నాని ఖండించినట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో కథనం వెలువడింది. బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లను ముంబైకి చెందిన ఒక టీమ్ ఎంపిక చేస్తుందని - ఆ ఎంపికతో నానికి ఎటువంటి సంబంధం లేదని `స్టార్ మా` ప్రతినిధులు స్పష్టం చేసినట్లు ఆ కథనం వెలువడింది.
బిగ్ బాస్ ప్రతినిధులు గానీ - `స్టార్ మా`ప్రతినిధులుగానీ బిగ్ బాస్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డిని సంప్రదించలేదని `స్టార్ మా` స్పష్టం చేసింది. అంతేకాకుండా - `స్టార్ మా` సిబ్బందికి కూడా షోకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా గురించి ముందుగా తెలిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలపై కూడా నాని స్పందించినట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని - ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆమెకు మామూలేనని నాని చెప్పినట్లు కథనంలో వెలురించింది. కాబట్టి ఆ వ్యవహారంపై స్పందించకపోవడమే మంచిదని నాని అభిప్రాయపడినట్లు పేర్కొంది. ఈ విధంగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను బిగ్ బాస్ నిర్వాహకులు - స్టార్ మా - నాని ఖండించారు. ఇక, ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి ఏవిధంగా స్పందిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.