నాని ట్వీట్ తో రచ్చ మొదలైంది

Update: 2017-06-29 17:59 GMT
యంగ్ హీరో నానికి ఇండస్ట్రీలోనే కాదు.. జనాల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. స్టార్ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో అయినా.. చాలా సింపుల్ గా ఉండడం.. హంగూ ఆర్భాటాల లాంటివేమీ ప్రదర్శించకుండా ఉండడాన్ని.. నాని ప్రవర్తనలో ప్రత్యేకించి చెప్పుకుంటారు. అలాగే వివాదాలకు కూడా వీలైనంత దూరంగా ఉండడం కూడా నేచురల్ స్టార్ కి కలిసొచ్చే అంశమే. అలాగే అవసరం అయినప్పుడు ఒక రేంజులో క్లాసులు కూడా పీకుతాడు.

ఒక్క ట్వీట్ తో ఒక్కసారిగా చాలామందికి నాని షాకిచ్చేశాడు. ఈ హీరోకు చాలా కాలంగా అభిమాని అయిన ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు నాని ఇచ్చిన రిప్లై ఇందుకు కారణం అయింది. 'పబ్లిసిటీ గురించి ఒక ఫ్యాన్ గా కోనని అడిగితే బ్లాక్ చేశాడు' అని ఆ ఫాలోయర్ ట్వీట్ చేశాడు. అంటే 'నిన్ను కోరి' సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. ఆ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ అవ్వనున్నా కూడా ఇంకా అసలు పబ్లిసిటీ లేదు కాబట్టి.. ఆ ఫ్యాన్ అలా ఆవేశపడి కోనను ట్విట్టర్లో తిట్టేసి.. అదే విషయం నానికి చెప్పాడు. దీనికి నాని రిప్లై స్ట్రాంగ్ గానే ఉంది.

'నువ్వు నా ఫ్యాన్ అని చెప్పుకుంటావ్. థ్యాంక్యూ.. కానీ నీ ట్వీట్స్ ఇతరులను ఉద్దేశించి ఉంటాయ్. నువ్వు భాష అయినా మార్చుకోవాలి.. లేదా ట్విట్టర్ హ్యాండిల్ పేరు అయినా మార్చుకో. టేక్ కేర్' అని రిప్లై ఇచ్చాడు నాని. ఆ తరువాత ఆ ఫ్యాన్ స్పందిస్తూ నేను చేసినదాంట్లో తప్పుంటే మన్నించండి అంటూ పెద్ద వివరణే ఇచ్చాడు. అయితే నాని కూడా ఫ్యాన్ పై అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది అంటున్నారు కొందరు సినీ లవర్స్. ఆ తరువాత ఈ ట్వీట్ పై ఇక యాజూజువల్ పెద్ద రచ్చే మొదలైందిలే.
Tags:    

Similar News