ఎన్టీఆర్ - మహేష్‌ వెనకబడిపోయారు

Update: 2015-09-22 09:30 GMT
నాని ఒక్కో స్టార్ హీరోను దాటుకెళ్లిపోతున్నాడు. అమెరికాలో ‘భలే భలే మగాడివోయ్’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావడమే ఆశ్చర్యమైతే రెండు - మూడు వారాల్లో కూడా నిలకడగా వసూళ్లు రావడం ఇంకా ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది. మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టి షాకిచ్చిన నాని.. ఆ తర్వాత కూడా 36 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. మూడో వీకెండ్ ముగిసే సరికి ‘భలే భలే మగాడివోయ్’ వసూళ్లు 1.36 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

రెండో వీకెండ్ తో టాప్-15లోకి అడుగు పెట్టిన ‘భలే భలే మగాడివోయ్’ మూడో వీకెండ్ తర్వాత టాప్-10లోకి దూసుకొచ్చి ఇప్పుడు తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో మహేష్ - ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ల సినిమాల్ని దాటేశాడు నాని. యుఎస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బాద్ షా (1.28 మిలియన్లు) - ఫ్లాపైనా యుఎస్ లో మంచి వసూళ్లు రాబట్టిన మహేష్ సినిమా 1 నేనొక్కడినే (1.31 మిలియన్లు) వెనకబడిపోయాయి.

రేసుగుర్రం 1.395 మిలియన్ లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ రికార్డును కూడా ‘భలే భలే మగాడివోయ్’ దాటేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏడో స్థానంలో ఉన్న ఆగడు (1.48 మిలియన్లు)ను మాత్రం భలే భలే.. అందుకోలేకపోవచ్చు. అయినప్పటికీ స్టార్ హీరోలకు మాత్రమే మంచి వసూళ్లు దక్కే యుఎస్ లో నాని లాంటి మోడరేట్ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అసామాన్యమైన విషయం.
Tags:    

Similar News