నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం `అంటే సుందరానికి` విడుదల కోసం వేచి చూస్తున్నాడు. జూన్ 10 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. అలాగే నాని నటిస్తున్న దసరా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే ఇవే గాక నాని నటించే తదుపరి చిత్రంపైనా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మహేష్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు నేచురల్ స్టార్ అంగీకరించారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబో మూవీ SSMB 28 షూటింగ్ ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇందులో నాని ఓ కీలక పాత్రను పోషిస్తారని కథనాలొస్తున్నాయి. కొద్దిరోజులుగా ఈ వార్త వైరల్ గా మారడంతో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది.
త్రివిక్రమ్ నానిని సంప్రదించారని రెండో ఆలోచన లేకుండా నాని అందుకు అంగీకరించారని గుసగుసలు స్ప్రెడ్ అవ్వడంతో ఇది నిజమేనని కూడా నమ్మేస్తున్నారు. ఇదే విషయమై నానీని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సింపుల్ గా జవాబిచ్చాడు నాని. ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని అధికారికంగా ఏదైనా తానే వెల్లడిస్తానని తెలిపాడు. మొత్తానికి మహేష్- నాని కాంబినేషన్ మూవీ లేదని అధికారికంగా కన్ఫామ్ అయినట్టే.
మరోవైపు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో భారీ సినిమా కోసం మహేష్ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అది ఎలానూ పాన్ ఇండియా సినిమా కాబట్టి అందులో నానీకి స్కోప్ ఉంటుందేమో చూడాలి. రాజమౌళి వరసగా మల్టీస్టారర్లు చేస్తున్నారు. బాహుబలితో ప్రభాస్- రానాకు బెస్ట్ మైలేజ్ నిచ్చిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ - తారక్ ని కలిపి బంపర్ హిట్ కొట్టారు.
ఇప్పుడు మహేష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మరి నానీకి కూడా ఇందులో ఛాయిస్ ఉంటే బావుంటుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. నానీతో రాజమౌళి ఈగ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సంగతి విధితమే. జక్కన్నతో నాని స్నేహం కూడా దీనికి కలిసి రావొచ్చేమో!