హీరోలు నిర్మాతలుగా మారడమనేది ఎన్టీఆర్ టైం నుంచి ఉన్నదే. ఆయనతోపాటు ఏఎన్ ఆర్ కృష్ణ చిరంజీవి వీళ్లంతా కూడా సొంత బ్యానర్ లో సినిమాలు చేసిన వారే. తర్వాత కాలంలో వచ్చిన హీరోల్లో చాలామంది రెండు పడవలపై ప్రయాణం ఇష్టం లేక సినిమా ప్రొడక్షన్ ను పట్టించుకోవడం మానేసి ఓన్లీ నటులుగానే కొనసాగారు. మళ్లీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ కాస్త మారింది. హీరోలు కూడా ప్రొడక్షన్ లో భాగస్వాములు అవుతున్నారు.
నేచురల్ స్టార్ నాని కూడా అవసరమైతే సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నాడు. అయితే దానికి కొన్ని కండిషన్స్ అప్లయ్ అవుతాయని అంటున్నాడు. ఎవ్వరూ డీల్ చేయని సబ్జెక్టుతో కథ రాసుకొచ్చి ఆ సినిమాను ఇంకెవ్వరూ తీయడానికి ముందుకు రాకపోతే తాను ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. లో బడ్జెట్ లో సినిమా అయిపోవాలన్నది మరో కండిషన్. పైపెచ్చు తాను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తాను హీరోగా నటించనని కరాఖండిగా చెబుతున్నాడు. నిర్మాత లేదా హీరో రెండిట్లో ఒక్కటే డీల్ చేస్తానన్నది వన్ మోర్ కండిషన్.
ఈమధ్య కాలంలో హీరోలు కళ్యాణ్ రామ్ - నితిన్ నిర్మాతలుగా వేరే వారితో సినిమాలు తీశారు. రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ కిక్-2 నిర్మిస్తే.. అఖిల్ హీరోగా నితిన్ సినిమా నిర్మించారు. ఈ ఇద్దరికీ చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అందుకేనేమో నాని ముందుజాగ్రత్తగా ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు. అంతే మరి సినిమా నిర్మాణంలో మెయిన్ రిస్క్ చేసేది నిర్మాతే కదా. తేడా వస్తే జేబులు ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త మంచిదే.