నాని ఎంత కాన్ఫిడెంటుగా ఉన్నాడంటే..

Update: 2016-02-09 19:30 GMT
నాని కొత్త సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమాపై పరిశ్రమలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యూనిట్ సభ్యులు కూడా చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. నాని అయితే తన కెరీర్లోనే ఏ సినిమా మీద లేనంత కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద చూపిస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘మామూలుగా అయితే నా సినిమా విడుదలవుతోందంటే నాకు ఆ ముందు రోజు నిద్ర పట్టదు. నా మైండ్ అంతా ఏదోలా అయిపోతుంది. తిండి కూడా తినాలనిపించదు. సినిమా రిజల్ట్ ఏంటో తెలుసుకునేవరకు మామూలు మనిషిని కాలేను. ఐతే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ విషయంలో మాత్రం నాకు ఏమాత్రం టెన్షన్ లేదు. నా కెరీర్లో ఏ సినిమాకు కూడా ఇంత కాన్ఫిడెంటుగా లేను. చాలా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నా. సినిమా మీద అంత నమ్మకం ఉంది. నేనెందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో రేపు సినిమా చూశాక జనాలకే తెలుస్తుంది’’ అన్నాడు నాని.

‘భలే భలే మగాడివోయ్’ లాంటి బిగ్ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు అందుకోవాలన్న ప్రెజర్ ఏమీ లేదా అని అడిగితే.. ‘‘సక్సెస్ వల్ల వచ్చే ఒత్తడిని తట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఫెయిల్యూర్లలో ఉన్నపుడు ఆ తర్వాతి సినిమాకు వచ్చే ప్రెజర్ ఎదుర్కోవడమే చాలా కష్టం.
Tags:    

Similar News