ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఉన్నారే. అసలు వీళ్ళ ఎక్సయిట్మెంట్ ఏంటో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. గత రాత్రి జరిగిన 'నిన్నుకోరి' సినిమా ఆడియో లాంచ్ లో కూడా ఒక సీన్ ఇలాంటి ఫీలింగే తెచ్చింది. మామూలుగా మెగా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ.. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు బాలయ్య ఫ్యాన్స్ రచ్చ.. ఆల్రెడీ మనం చూశాం. ఇప్పుడు నాని మాట్లాడుతుంటే.. నాని ఫ్యాన్స్ కూడా గోలగోల చేస్తున్నారు. మనోడు వెంటనే షాకై.. ''ఆగండ్రా బాబు.. నేనేదో మాట్లాడదాం అని వచ్చాను. చెప్పనివ్వండి'' అంటూ కాస్త కసరితే కాని.. వారు సైలెంట్ అవ్వలేదు.
ఇకపోతే నాని తన సినిమా గురించి భలేగా చెప్పాడు. ''నిన్ను కోరి సినిమా మీద ఇష్టంతో.. నా మీద ప్రేమతో.. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళందరికీ ఒకటి చెబుతున్నా. మీ ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ సినిమా మీరు ఇంటికి తీసుకెళతారు. కొన్ని సినిమాలుంటాయి.. మనం సినిమా చూసి ఇంటికి వెళిపోతాం. కొన్ని మాత్రం ఇంటికి తీసుకెళతాం. ఈ నిన్ను కోరి మీరు ఇంటికి తీసుకెళ్ళి మనస్సులో దాచుకుంటారు. ఒట్టేసి చెబుతున్నాను.. నేను మీ ముందే ఉంటాను కాబట్టి.. నేను చెప్పింది నిజం కాకపోతే మీరు నన్ను నిలదీయొచ్చు. కాని ఆ ఛాన్స్ మీకు రాదు'' అన్నాడు నాని.
మొత్తానికి సినిమా గురించి ఏమీ చెప్పను.. ఎవ్వరి గురించి ఏమీ చెప్పను అంటూనే.. సినిమా గురించి బలమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశాడు. నాని ఈ రేంజు కాన్ఫిడెంట్ గా చెప్పాడంతో ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ బాగా ఉందనే అనుకోవాలి. కాకపోతే గతంలో కూడా ఇలాంటి ప్రేమ కథలు నానిని ముంచేశాయి. ఎంతో కాన్ఫిడెంటుగా చేసిన గౌతమ్ మీనన్ ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా ధియేటర్ల దగ్గర భారీ షాకిచ్చింది. చూద్దాం ఇప్పుడేం అవుతుందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/