వర్క్-లైఫ్-బ్యాలెన్స్. ఈ పదాన్ని కార్పొరేట్ కల్చర్‌లో తెగ వింటుంటాం. ఎందుకంటే చాలామంది ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ మానసికంగా క్షోభించడం, లేకపోతే ఇంకేదైనా ఎక్స్‌ట్రీమ్ డెసిషన్లు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇక మన తెలుగు హీరోలు కూడా అంతే. వర్క్ గురించి తెగ కష్టపడుతూ ఉంటారు. మరి వారి పర్సనల్ లైప్‌పైన ఆ స్ట్రెస్ ఉండదా? ఉంటుంది.
హీరో నాని గురించే తీసుకుంటే.. పెళ్ళాయ్యాక నాని ఏమన్నా మారాడా? ఇప్పటికే పెళ్లయ్యి రెండు సంవత్సరాలైంది. మరి తన వైఫ్ అంజన ఏమంటోంది? ''పెళ్ళి వరన నేనేం మారలేదు. ఇప్పటికు మా ఆవిడ ఏమంటుందంటే.. నీ ఫోనే నీ ఫస్ట్ వైఫ్ అని.. నా ఫోన్ ఏదో ఒకరోజు పోయిందని తెలిస్తే మాత్రం ఆమె ఆనందపడుతుంది. నిజంగానే మొన్న ఎవడే సుబ్రమణ్యం సినిమా కోసం హిమాలయాల్లో షూటింగ్ చేసినప్పుడు చాలా థ్రిల్‌కు గురయ్యా. అక్కడ ఫోన్ లేదుగా.. అందుకే'' అంటున్నాడు నాని.
ఇకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చెబుతూ.. ''మా ఆవిడ ఒక్క విషయంలో నన్న మారమని చెబుతోంది. ఏదైనా చిన్న విషయం జరిగినా నేను పర్సనల్‌గా తీసుకొని మూడీగా అయిపోతుంటా.. అది తనకు నచ్చదు. ఇంటికొచ్చినప్పుడు వర్క్ గురించి మర్చిపోమంటోంది. మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా'' అని సెలవిచ్చాడు. ఖచ్చితంగా ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టాల్సిందే బాసూ!!