నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌కు స్ఫూర్తి ఏది?

Update: 2019-09-11 05:30 GMT
గ‌త కొంత‌కాలంగా `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` క‌థ ఇదీ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓ బ్యాంక్ దొంగ‌త‌నం చేసి పారిపోతున్న ఐదుగురిని ఛేజింగ్ లో దుండ‌గుడు చంపేస్తాడు. ఆ ఐదుగురి బంధువులు అయిన ఐదుగురు లేడీస్ .. రివెంజ్ రైట‌ర్ నానీని సాయం కోర‌తారు. త‌మ వారిని చంపిన వాడిని ప‌ట్టుకుని రివెంజ్ తీర్చుకోవాల‌ని  ఆ ఐదుగురు భావిస్తారు. అయితే మొహ‌మాటానికి ఒప్పుకున్న నాని ఆ త‌ర్వాత వీళ్ల‌తో క‌లిసి ఎలాంటి చిక్కుల్ని ఎదుర్కొన్నాడు? అన్న‌దే సినిమా. ఇందులో ఆ దుండ‌గుడు ఎవ‌రు... నానీలో డ్యూయ‌ల్ షేడ్ ఏమిటి? అన్న స‌స్పెన్స్ ని ఫైన‌ల్ గా రివీల్ చేస్తార‌ట‌.

అయితే ఇది ఒరిజిన‌ల్ క‌థ కాదా?  ఏదైనా హాలీవుడ్ స్ఫూర్తి ఉందా? అంటూ మ‌రో ఆస‌క్తిక‌ర డిబేట్ తాజాగా సోష‌ల్ మీడియాలో మొద‌లైంది. గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌కు స్ఫూర్తి ద‌క్షిణ కొరియా సినిమా `గ‌ర్ల్ స్కౌట్`. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ న‌లుగురు ఆడాళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న సొమ్ముతో ఓ సూప‌ర్ మార్కెట్ పెట్టాల‌ని అనుకుంటారు. అయితే ఇంత‌లోనే ఆ డ‌బ్బును కొట్టేసి పారిపోతాడు ఒక‌డు. ఆ త‌ర్వాత అత‌డిని వెతుక్కుంటూ ఆ న‌లుగురు గాళ్స్ స్కౌట్ గ్రూప్ గా ఏర్ప‌డి చేసిన ప్ర‌య‌త్నం ఎలాంటిది? అన్న‌దే సినిమా. ఈ ప్ర‌య‌త్నంలో ఫ‌న్ ఎలిమెంట్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. `గ‌ర్ల్ స్కౌట్` ట్రైల‌ర్ ఆద్యంతం క‌డుపు చెక్క‌ల‌య్యే ఫ‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది. కిమ్ సాంగ్ మేన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2008 జూన్ లో ఈ చిత్రం రిలీజైంది.

అయితే సేమ్ టు సేమ్ అదే క‌థ కాదు కానీ.. ఇంచుమించు ఈ క‌థ నుంచి స్ఫూర్తి పొంది విక్ర‌మ్.కె `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` క‌థ రాసుకున్నాడ‌న్న‌ది నెటిజ‌నుల నివేద‌న‌. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు చాలానే మార్పు చేర్పులు చేసి ప్రీమేక్ చేశార‌ని చ‌ర్చా వేదిక న‌డుస్తోంది. గ్యాంగ్ లీడ‌ర్ లో విక్ర‌మ్.కె మార్క్ లాజిక్ - ఫ‌న్ పెద్ద ఎత్తున వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని నాని న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం..  పోలెండ్ కి చెందిన సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లాకుబాబ్రోజెక్ ప‌నిత‌నం ప్ల‌స్ అని చెబుతున్నారు. ఈ శుక్ర‌వారం (13న‌) సినిమా రిలీజ‌వుతోంది.


Full View

Tags:    

Similar News